English | Telugu

నాగ్‌కి నలుగురు అమ్మాయిలు కావాలా?!

టాలీవుడ్‌లో మ‌న్మ‌ధుడు అంటే.. ఇప్ప‌టికీ, ఎప్ప‌టికీ నాగార్జున‌నే. వ‌య‌సులో ఆఫ్ సెంచరీ చేసినా, ఇంట్లో ఇద్దురు హీరోలున్నా ఇప్ప‌టికీ యంగ్ లుక్ పోలేదు. స్టైల్స్‌లోనూ, లుక్స్‌లోనూ ఈత‌రం క‌థానాయ‌కులకు తీసిపోడు నాగ్‌. అందుకే ఇద్ద‌రు అమ్మాయిల‌తో ఆడిపాడినా... ప్రేక్ష‌కులు ఓకే చెప్పేస్తారు. ఇప్పుడు నాగ్ న‌లుగురు భామ‌ల‌తో జ‌త క‌ట్ట‌బోతున్నాడ‌ట‌. నాగ్‌లోని రొమాన్స్‌ని మ‌రో కోణంలో చూపించ‌డానికి క‌స‌ర‌త్తులు జ‌రుగుతున్నాయి. ఆయ‌న‌లోని రియ‌ల్ మ‌న్మ‌ధుడిని మ‌రో సినిమాతో తెర‌పై చూపించ‌బోతున్నారు. నిర్మాత సి. క‌ల్యాణ్ నాగార్జున‌తో ఓ సినిమా ప్లాన్ చేస్తున్న‌ట్టు తెలిసింది. ఇందులో నాగ్ స‌ర‌స‌న న‌లుగురు క‌థానాయిక‌లు ఉంటార‌ట‌. ఆ న‌లుగురి ప్రేమ‌లో నాగ్ ఎలా మునిగాడు? చివ‌రికి ఎలా తేలాడో ఈ రొమాంటిక్ చిత్రంలో చూపించ‌బోతున్నార‌ట. ద‌ర్శ‌కుడు ఎవ‌రు? ఎప్పుడు మొద‌ల‌వుతుంది? అనే విష‌యాలు త్వ‌ర‌లో తెలుస్తాయి. ''నాగార్జున‌తో ఓ సినిమా చేయ‌బోతున్నా. ఇదో రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌.న‌లుగురు హీరోయిన్లుంటారు. క‌థ రెడీగా ఉంది'' అంటున్నారు సి.కల్యాణ్‌.

రాజాసాబ్ సర్కస్ 1935 .. సీక్వెల్ కథ ఇదేనా! 

పాన్ ఇండియా ప్రభాస్(Prabhas)అభిమానులు,ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రెబల్ మూవీ 'ది రాజాసాబ్'(The Raja saab)నిన్న బెనిఫిట్ షోస్ తో థియేటర్స్ లో ల్యాండ్ అయ్యింది. దీంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కళకళలాడుతున్నాయి. సుదీర్ఘ కాలం తర్వాత సిల్వర్ స్క్రీన్ పై వింటేజ్ ప్రభాస్ కనిపించడంతో ఫ్యాన్స్ ఆనందానికి అయితే అవధులు లేవు. రిజల్ట్ విషయంలో మాత్రం మిక్స్డ్ టాక్ వినపడుతుంది. రివ్యూస్ కూడా అదే స్థాయిలో  వస్తున్నాయి. కాకపోతే తెలుగు సినిమా ఆనవాయితీ ప్రకారం ఈ రోజు సెకండ్ షో కంప్లీట్ అయిన తర్వాత గాని అసలైన టాక్ బయటకి రాదు.