English | Telugu
ట్విస్ట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ రియాక్షన్ ఏంటో..?
Updated : Oct 9, 2024
రీసెంట్ గా 'దేవర'తో మరో విజయాన్ని ఖాతాలో వేసుకున్న జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR).. నెక్స్ట్ 'వార్-2'తో పాటు, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. మిక్స్డ్ టాక్ వచ్చిన 'దేవర' తోనే ఎన్టీఆర్ ఈ స్థాయి వసూళ్లు రాబడితే.. ఇక నీల్ తో చేస్తున్న సినిమాతో ఏ స్థాయి వసూళ్లు రాబడతాడోనన్న ఆసక్తి అందరిలో నెలకొంది. ఇక ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి కొన్ని ఆసక్తికర వార్తలు వినిపిస్తున్నాయి. (NTR Neel)
ఎన్టీఆర్-నీల్ మూవీ రెగ్యులర్ షూటింగ్ ఈ అక్టోబర్ చివరిలో లేదా నవంబర్ మొదటి వారంలో స్టార్ట్ కానుందని తెలుస్తోంది. అయితే ఎన్టీఆర్ మాత్రం జనవరి లేదా ఫిబ్రవరిలో సెట్స్ లో అడుగుపెట్టనున్నాడు. ఈలోపు ఎన్టీఆర్ లేని సన్నివేశాల చిత్రీకరణ జరగనుంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ ఖరారు అయినట్లు సమాచారం.
అలాగే ఈ సినిమాకి సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తోంది. ఈమధ్య భారీ చిత్రాలన్నీ రెండు భాగాలుగా తెరకెక్కుతున్నాయి. ఎన్టీఆర్-నీల్ మూవీ కూడా రెండు భాగాలుగా రూపొందుతుందని మొదటి నుంచి వినిపించిన మాట. దీంతో ఇది 'కేజీఎఫ్'కి మించిన సంచలనాలు సృష్టిస్తుందని ఎన్టీఆర్ ఫ్యాన్స్ బలంగా ఫిక్స్ అయ్యారు. అయితే తాజా సమాచారం ప్రకారం.. ఇది స్టాండ్ ఎలోన్ ఫిల్మ్ అని, భాగాలు ఉండవని తెలుస్తోంది.
మొదట స్టాండ్ ఎలోన్ ఫిల్మ్ అనుకున్న దేవర.. అనుకోకుండా రెండు భాగాలు అయింది. మొదటి నుంచి రెండు భాగాలు అనుకున్న నీల్ ప్రాజెక్ట్ ని.. ఇప్పుడు స్టాండ్ ఎలోన్ ఫిల్మ్ అంటున్నారు. మరి దీనిపై ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.