English | Telugu

ఢిల్లీ హైకోర్టులో కేసు గెలిచిన మంచు విష్ణు.. ఎవడ్రా మా సినిమా చూసి నవ్వేది 

కొన్ని యూట్యూబ్ ఛానల్స్ సినీ సెలబ్రటీస్ ప్రతిష్ఠను దిగజార్చేలా వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూ రకరకాల ట్రోల్స్ చేస్తున్న విషయం తెలిసిందే.ఈ క్రమంలోనే మంచు విష్ణు(manchu vishnu)పై కూడా చాలా దారుణంగా ట్రోల్ల్స్  జరుగుతున్నాయి.పైగా ఆయన పేరుని, స్వరాన్ని, నటించిన చిత్రాలని ఇష్టా రాజ్యంగా వాడుకుంటున్నారు. వీటిపై ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన మంచు విష్ణుకు ఇప్పుడు ఊరట దక్కింది.

మంచు విష్ణు ప్రతిష్ఠను దిగజార్చేలా ఉన్న వీడియోలను తొలగించాలంటూ సంబంధిత యూట్యూబ్‌ ఛానళ్ల నిర్వాహకులకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఛానల్ నిర్వాహకులు నలభై ఎనిమిది గంటల్లో తమంతట తాముగా వీడియోలను తొలగించకపోతే  యూట్యూబ్‌‌ యాజమాన్యం వాటిని తొలగించే బాధ్యతలని తీసుకోవాలని కూడా కోర్టు హెచ్చరికలు జారీ చేసింది.కేంద్ర సమాచారశాఖ, ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ శాఖను కూడా అందుకు సంబంధించిన  10 యూఆర్‌ఎల్‌ లింక్‌లను  తొలగించాలని కోర్టు ఆదేశించింది.

మంచు విష్ణు ప్రస్తుతం ఎంటైర్ తన సినీ కెరీర్ లోనే ప్రెస్టేజియస్ట్ మూవీగా తెరకెక్కుతున్న కన్నప్ప(kannappa)కి సంబంధించిన పనుల్లో బిజీగా ఉన్నాడు. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న ఈ మూవీ ద్వారా పరమేశ్వరుడి ప్రియ భక్తుడైన కన్నప్ప జీవిత చరిత్రని  చెప్పబోతున్నాడు. ప్రభాస్(prabhas)అక్షయ్ కుమార్, మోహన్ బాబు(mohan babu)వంటి స్టార్స్ కూడా ఇందులో నటిస్తుండటంతో సినిమా మీద అందరిలో ఆసక్తి నెలకొని ఉంది. ఇక కోర్టు తీర్పు నేపథ్యంలో కన్నప్ప ట్రోల్ల్స్ భారిన పడకుండా ఉండనుంది.