English | Telugu
మోహన్‌లాల్ కొన్న కారు విలువెంతో తెలుసా?
Updated : Apr 11, 2023
మలయాళం సూపర్‌స్టార్ మోహన్‌లాల్ లేటెస్ట్ గా బ్రాండ్ న్యూ కస్టమైజ్డ్ రేంజ్ రోవర్ కారు కొన్నారు. ఇప్పుడు ఆ కారు పిక్స్ వైరల్ అవుతున్నాయి. దక్షిణాదిన అత్యధిక పారితోషికం తీసుకునే హీరోల్లో మోహన్‌లాల్ ఒకరు. నటనంటే ఎంత ఇష్టమో, వంట చేయడమన్నా, ఆటోమొబైల్స్ అన్నా అంతే ఇష్టం మోహన్‌లాల్‌కి. ఆయన గేరేజ్ నిండుగా రకరకాల మోడల్ కార్లుంటాయి. లేటెస్ట్ గా ఆ అడిషన్‌లో రేంజ్ రోవర్ చేరింది. రేంజ్ రోవర్ విలువ అక్షరాలా రూ.5కోట్లు. తెలుపు రంగులో ఉంది ఈ కారు. కొచ్చిలోని ఆయన ఇంటికి కారును చేర్చారు మేనేజర్స్. లాల్ ఏట్టన్ విత్ హిస్ బ్రాండ్ న్యూ రేంజ్ రోవర్ అంటూ ట్వీట్స్ వైరల్ చేస్తున్నారు ఫ్యాన్స్.
ఇటీవల మోహన్‌లాల్‌కి ఆయన మిత్రుడు శ్రీనివాసన్‌కి మధ్య పెద్ద గొడవయింది. ప్రేమ్ నజీర్ డ్రీమ్ ప్రాజెక్ట్ లో నటించడానికి మోహన్‌లాల్ ఒప్పుకోకపోవడంతో పెద్ద పెద్ద అలిగేషన్స్ చేశారు శ్రీనివాసన్. మోహన్‌లాల్ గురించి అన్ని పార్శ్వాలూ తనకు తెలుసునని అన్నారు. త్వరలోనే వాటన్నిటినీ బట్టబయలు చేస్తానని చెప్పారు. ఈ విషయం గురించి మోహన్‌లాల్ ఫ్రెండ్ ప్రియదర్శన్ దగ్గర ప్రస్తావించారు ఓ జర్నలిస్ట్. ``వాళ్లిద్దరూ నాకు మంచి మిత్రులే. అసలు శ్రీనివాసన్ అలా ఎందుకు మాట్లాడారో నాకు అర్థం కావడం లేదు. ఒకవేళ ఆయన ఆరోగ్య కారణాల రీత్యా అలా మాట్లాడారేమో. అయినా వారిద్దరి మధ్య అసలేం జరిగిందో తెలియకుండా నేను ఈ విషయం మీద మాట్లాడితే అసలు బావుండదు`` అని అన్నారు. మోహన్‌లాల్‌కి ఇప్పుడు చేతినిండా సినిమాలున్నాయి. లిజో జోస్ పెల్లిస్సిరీ మలైకోట్టై వాలిబన్ షూటింగ్ ప్రస్తుతం కేరళలో జరుగుతోంది. ఏప్రిల్ 14న ఈ సినిమా ఫస్ట్ లుక్ రివీల్ అవుతుందని అనౌన్స్ చేశారు మోహన్‌లాల్. రజనీకాంత్ హీరోగా నటిస్తున్న జైలర్‌లోనూ కీ రోల్ చేస్తున్నారు మోహన్‌లాల్. నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇది. దృశ్యం డైరక్టర్ జీతు జోసెఫ్ దర్శకత్వంలో రామ్ అని ఓ సినిమా చేస్తున్నారు. ఇందులో త్రిష నాయిక. బారోజ్ అనే సినిమాతో డైరక్టర్‌గానూ ఎంట్రీ ఇస్తున్నారు. పృథ్విరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో ఎల్2: ఎంపురాన్ సినిమా సిద్ధమవుతోంది.