English | Telugu

ప్రభాస్ పెళ్లి, పిల్లలపై మోహన్ బాబు కీలక వ్యాఖ్యలు  

ఈ రోజు పుట్టిన రోజుని జరుపుకుంటున్న పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas)బర్త్ డే వేడుకల్నివరల్డ్ వైడ్ గా ఉన్న అభిమానులు ఎంతో ఘనంగా జరుపుకుంటున్నారు. సోషల్ మీడియా వేదికగా కూడా తమ అభిమాన నటుడికి బర్త్ డే విషెస్ చెప్తుండటంతో హాష్ టాగ్ ట్రెండ్ అవుతుంది. ఇక ఇండస్ట్రీ కి సంబంధించిన పలువురు హీరోలు, శ్రేయోభిలాషులు ప్రభాస్ కి బర్త్ డే విషెస్ ని చెప్తున్నారు. ఈ కోవలోనే కలెక్షన్ కింగ్ మోహన్ బాబు(Mohan Babu)తనదైన స్టయిల్లో ప్రభాస్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పాడు.

'ఎక్స్'(X)వేదికగా స్పందిస్తు 'నా ప్రియమైన డార్లింగ్ బావ ప్రభాస్. నువ్వు దేశం గర్వించే వ్యక్తివి. నీకు శతాయుష్షు, ఆరోగ్యం, ఆనందం కలగాలి. త్వరలోనే పెళ్లి చేసుకుని అర డజను పిల్లలతో సంతోషంగా జీవించాలని కోరుకుంటున్నాను అంటు ట్వీట్ చేసాడు. ఇప్పుడు ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రభాస్, మోహన్ బాబు మధ్య సుదీర్ఘ కాలం నుంచి మంచి అనుబంధం ఉంది. ఇద్దరు ఒకరినొకరు బావ, బావ అని పిలుచుకుంటారు.

సినిమాల పరంగా చూసుకుంటే ఈ ఇద్దరు కలిసి బుజ్జిగాడు మేడిన్ చెన్నైలో ఫస్ట్ టైం స్క్రీన్ షేర్ చేసుకున్నారు. 2008 లో ప్రేక్షకుల ముందుకు రాగా మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత ఈ ఏడాది కన్నప్ప లో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. కన్నప్ప(Kannappa)ని దైవ మార్గం వైపు పయనించేలా చెయ్యడానికి వచ్చిన పరమేశ్వరుని దూత రుద్ర క్యారక్టర్ లో ప్రభాస్ కనిపించాడు. ఇందుకు గాను ప్రభాస్ ఎలాంటి రెమ్యునరేషన్ తీసుకోలేదు.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.