English | Telugu

మూడేళ్లుగా పరారీలో ఉన్న ప్రముఖ నటి ఆచూకీ లభ్యం.. అరెస్టుకి ఆదేశించిన కోర్టు

సూర్య(Suriya)కీర్తిసురేష్(Kirthi Suresh)జంటగా నటించిన తమిళ చిత్రం 'థానా సెర్ధా కూటమ్'.క్రైమ్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కగా, 2018 లో విడుదలైంది. నయనతార' భర్త 'విగ్నేష్ శివన్'(Vignesh Shivan)దర్శకత్వం వహించాడు. ఈ మూవీలో సూర్య ఫ్రెండ్ క్యారక్టర్ కి వైఫ్ గా నటించి ప్రత్యేక గుర్తింపు పొందిన నటి 'మీరా మిథున్‌'(Meera Mithun). ఈ నటి 2021, ఆగష్టు 7న సోషల్ మీడియాలో ఒక వీడియోను షేర్ చేసింది. సదరు వీడియోలో ఆమె మాట్లాడుతు ఒక దర్శకుడు నా ఫోటోని దొంగిలించి తన సినిమా ఫస్ట్‌లుక్ కోసం వాడుకున్నాడు. తమిళ చిత్ర సీమలో షెడ్యూల్ కులాలకి చెందిన వ్యక్తులందరినీ తొలగించాలంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. దీంతో ఆమెపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం కింద పోలీసు కేసు నమోదైంది.

ఈ కేసులో మీరామిథున్ పరారిలో ఉండగా, పోలీసులు కేరళలో అరెస్ట్ చేసి కోర్ట్ లో హాజరుపరిచారు. కొన్ని రోజులు జైలు శిక్ష కూడా అనుభవించింది. ఈ కేసులో ఆమె స్నేహితుడు శ్యామ్ అభిషేక్‌ కూడా జైలు కి వెళ్ళాడు. కొన్ని రోజుల తర్వాత ఇద్దరు బెయిల్‌పై విడుదలయ్యారు. కానీ ఆ తర్వాత అనేక పర్యాయాలు కోర్టు విచారణకి గైర్హాజరు అయ్యింది. దీంతో కోర్టు అరెస్ట్ వారెంట్ జారీచేసింది. కానీ మీరా అప్పటి నుంచి కనిపించకుండా పోయింది. పోలీసులు ఎంత గాలించినా ఆచూకీ దొరకలేదు. రీసెంట్ గా మీరా తల్లి ఢిల్లీ కోర్టు(Delhi Court)లో ఒక పిటిషన్ వేసింది. సదరు పిటిషన్ లో ఆమె మీరా గురించి రాస్తు 'ఢిల్లీ వీధుల్లో తిరుగుతున్న నా కూతుర్ని కాపాడండంటూ పొందుపరిచింది. దీంతో కోర్టు ఆదేశాల మేరకు ఢిల్లీ పోలీసులు మీరా ని రక్షించి హోమ్‌కి తరలించారు.

ఈ విషయం వైరల్ గా మారడంతో చెన్నై(Chennai)లోని న్యాయస్థానం 'మీరా' ని వెంటనే అరెస్ట్ చేసి ఈ నెల 11న తమ ఎదుట హాజరుపరచాలని చెన్నై సెంట్రల్ క్రైమ్ పోలీసులని ఆదేశించింది. 2015 లో సినీ కెరీర్ ని ప్రారంభించిన మీరా సుమారు ఏడు చిత్రాల వరకు చేసింది. తమిళ బిగ్ బాస్ సీజన్ 3 లో కంటెస్ట్ గా కూడా పార్టిసిపేట్ చేసింది. ఎస్ సి ,ఎస్ టి అట్రాసిటీ కేసులో 'మీరా'మూడు సంవత్సరాలుగా పరారీలో ఉంది.


ఇండియన్ సినిమా హిస్టరీలో ఇలాంటి సినిమా రాలేదు.. మారుతి ఏమంటున్నాడు

రెబల్ సాబ్ ప్రభాస్(Prabhas)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ పై తన కట్ అవుట్ కి ఉన్న క్యాపబిలిటీని రాజాసాబ్(The Raja saab)తో మరోసారి చాటి చెప్పాడు. ఇందుకు సాక్ష్యం రాజాసాబ్ తో తొలి రోజు 112 కోట్ల గ్రాస్ ని రాబట్టడమే.  ఈ మేరకు  మేకర్స్ కూడా ఈ విషయాన్ని అధికారకంగా ప్రకటిస్తూ పోస్టర్ ని కూడా రిలీజ్ చేసారు. దీంతో ప్రభాస్ అభిమానుల ఆనందానికి అయితే అవధులు లేవు. చిత్ర బృందం ఈ రోజు రాజా సాబ్ కి సంబంధించిన విజయోత్సవ వేడుకలు నిర్వహించింది. దర్శకుడు మారుతీ తో పాటు, నిర్మాత విశ్వప్రసాద్(TG Vishwa Prasad)రాజా సాబ్ హీరోయిన్స్ నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హాజరయ్యారు.

రాజాసాబ్ సర్కస్ 1935 .. సీక్వెల్ కథ ఇదేనా! 

పాన్ ఇండియా ప్రభాస్(Prabhas)అభిమానులు,ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రెబల్ మూవీ 'ది రాజాసాబ్'(The Raja saab)నిన్న బెనిఫిట్ షోస్ తో థియేటర్స్ లో ల్యాండ్ అయ్యింది. దీంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కళకళలాడుతున్నాయి. సుదీర్ఘ కాలం తర్వాత సిల్వర్ స్క్రీన్ పై వింటేజ్ ప్రభాస్ కనిపించడంతో ఫ్యాన్స్ ఆనందానికి అయితే అవధులు లేవు. రిజల్ట్ విషయంలో మాత్రం మిక్స్డ్ టాక్ వినపడుతుంది. రివ్యూస్ కూడా అదే స్థాయిలో  వస్తున్నాయి. కాకపోతే తెలుగు సినిమా ఆనవాయితీ ప్రకారం ఈ రోజు సెకండ్ షో కంప్లీట్ అయిన తర్వాత గాని అసలైన టాక్ బయటకి రాదు.