English | Telugu
Mark Shankar: పవన్ కళ్యాణ్ కుమారుడి హెల్త్ అప్డేట్.. వైద్యులు ఏం చెప్పారంటే..?
Updated : Apr 9, 2025
సింగపూర్ లోని స్కూల్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) చిన్న కుమారుడు మార్క్ శంకర్ (Mark Shankar) గాయపడిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో అరకు పర్యటనలో ఉన్న పవన్ కళ్యాణ్.. నిన్న రాత్రి హైదరాబాద్ నుంచి సింగపూర్ కి వెళ్ళారు.
ప్రస్తుతం మార్క్ శంకర్ కి సింగపూర్ లోని ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది. చేతులు, కాళ్ళకు కాలిన గాయాలు కావడంతోపాటు ఊపిరితిత్తులకు పొగ చూరడంతో మార్క్ కి అత్యవసర వార్డులో చికిత్స అందిస్తున్నారు. ఆసుపత్రికి వెళ్ళి మార్క్ ను చూసిన పవన్.. అక్కడి వైద్యులు, అధికారులతో మాట్లాడారు. మార్క్ కోలుకొంటున్నాడని, ఊపిరితిత్తుల దగ్గర పొగ పట్టేయడం మూలంగా తలెత్తే ఆరోగ్యపరమైన ఇబ్బందులపై పరీక్షలు చేస్తున్నామని తెలియచేశారు. భారత కాలమాన ప్రకారం బుధవారం ఉదయం అత్యవసర వార్డు నుంచి గదికి తీసుకువచ్చారు. మరో మూడు రోజులపాటు వైద్యుల పర్యవేక్షణలో పరీక్షలు చేయాల్సి ఉంటుందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.