English | Telugu

ఇండస్ట్రీ అంతా ఒకే వెబ్ సిరీస్ లో.. అదేంటంటే!

తెలుగుతో పాటు ఇతర భాషల వెబ్ సిరీస్ లు ఈ మధ్యకాలంలో మంచి హిట్ సాధిస్తున్నాయి. మలయాళం ఇండస్ట్రీకి ఈ సంవత్సరం గోల్డెన్ ఇయర్ అని చెప్పాలి. ఎందుకంటే మలయాళ సినిమాలు ఎక్కువగా హిట్ పొందాయి.

ప్రేమలు, ముంజుమ్మల్ బాయ్స్, ఆవేశం, భ్రమయుగం.. ఇలా దాదాపు అన్నీ హిట్లుగా నిలిచాయి. ఇప్పుడు అలాంటి హిట్ కోసం ఓ వెబ్ సిరీస్ రూపొందించారు మేకర్స్. ఒక్కరు కాదు ఇద్దరు కాదు దాదాపు మలయాళం ఇండస్ట్రీ అంతా కలిసి ఓ వెబ్ సిరీస్ లో నటించారు. ఈ సిరీస్ గత రెండేళ్ళుగా షూటింగ్ జరుపుకుంది. ఈ సిరీస్ పేరు ' మనోరథంగల్(Manorathangal)'. ఇందులో మోహన్ లాల్, మమ్ముట్టి, ఫహాద్ ఫాజిల్, కమల్ హాసన్, బిజు మేనన్, పార్వతీ తిరువత్తు, అపర్ణ బాలమురళి, అసిఫ్ అలీ, సిద్ధిఖీ తదితరులు ఈ సిరీస్ లో నటించారు.

ఇంతమంది స్టార్ కాస్ట్ ఉన్న ఈ సిరీస్ ని రాసింది ఎమ్ టీ వాసుదేవర నాయర్. తొమ్మిది భాగాల ఆంథాలజీని ఎనిమిది మంది దర్శకులు తెరకెక్కించారు. ఎట్టకేలకు ఈ సిరీస్ ఓటీటీలోకి రావడానికి సిద్ధమైంది. అగస్ట్ 15 నుండి జీ5 లో స్ట్రీమింగ్ అవుతుందని మేకర్స్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సిరీస్ మలయాళంతో పాటు తెలుగు, కన్నడ, తమిళ భాషల్లో స్ట్రీమింగ్ అవ్వనుంది. ఇలా భారీ తారాగణం ఉన్న ఈ క్రేజీ సిరీస్ ని చూడటానికి మీలో ఎంతమంది రెడీగా ఉన్నారో కామెంట్ చేసేయ్యండి.

ఇండియన్ సినిమా హిస్టరీలో ఇలాంటి సినిమా రాలేదు.. మారుతి ఏమంటున్నాడు

రెబల్ సాబ్ ప్రభాస్(Prabhas)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ పై తన కట్ అవుట్ కి ఉన్న క్యాపబిలిటీని రాజాసాబ్(The Raja saab)తో మరోసారి చాటి చెప్పాడు. ఇందుకు సాక్ష్యం రాజాసాబ్ తో తొలి రోజు 112 కోట్ల గ్రాస్ ని రాబట్టడమే.  ఈ మేరకు  మేకర్స్ కూడా ఈ విషయాన్ని అధికారకంగా ప్రకటిస్తూ పోస్టర్ ని కూడా రిలీజ్ చేసారు. దీంతో ప్రభాస్ అభిమానుల ఆనందానికి అయితే అవధులు లేవు. చిత్ర బృందం ఈ రోజు రాజా సాబ్ కి సంబంధించిన విజయోత్సవ వేడుకలు నిర్వహించింది. దర్శకుడు మారుతీ తో పాటు, నిర్మాత విశ్వప్రసాద్(TG Vishwa Prasad)రాజా సాబ్ హీరోయిన్స్ నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హాజరయ్యారు.

రాజాసాబ్ సర్కస్ 1935 .. సీక్వెల్ కథ ఇదేనా! 

పాన్ ఇండియా ప్రభాస్(Prabhas)అభిమానులు,ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రెబల్ మూవీ 'ది రాజాసాబ్'(The Raja saab)నిన్న బెనిఫిట్ షోస్ తో థియేటర్స్ లో ల్యాండ్ అయ్యింది. దీంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కళకళలాడుతున్నాయి. సుదీర్ఘ కాలం తర్వాత సిల్వర్ స్క్రీన్ పై వింటేజ్ ప్రభాస్ కనిపించడంతో ఫ్యాన్స్ ఆనందానికి అయితే అవధులు లేవు. రిజల్ట్ విషయంలో మాత్రం మిక్స్డ్ టాక్ వినపడుతుంది. రివ్యూస్ కూడా అదే స్థాయిలో  వస్తున్నాయి. కాకపోతే తెలుగు సినిమా ఆనవాయితీ ప్రకారం ఈ రోజు సెకండ్ షో కంప్లీట్ అయిన తర్వాత గాని అసలైన టాక్ బయటకి రాదు.