English | Telugu

ఎంత డబ్బు కావాలో చెప్పు..ప్రభాస్ పై మంచు లక్ష్మి కీలక వ్యాఖ్యలు 

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(prabhas)కలెక్షన్ కింగ్ మోహన్ బాబు(mohan babu)ఫ్యామిలీకి మొదటి నుంచి మంచి అవినాభావ సంబంధం ఉంది.ఆ కారణంతోనే ప్రభాస్ తన బిజీ షెడ్యూల్స్ ని సైతం పక్కన పెట్టి, మంచు విష్ణు ప్రెస్టేజియస్ట్ మూవీ కన్నప్ప లో ఒక కీలక పాత్రలో చెయ్యడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.దీంతో వరల్డ్ వైడ్ గా కన్నప్ప ఒక ప్రత్యేకమైన క్రేజ్ ని సంతరించుకుందనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.గతంలో కూడా బుజ్జిగాడు మేడిన్ చెన్నై అనే మూవీలో ప్రభాస్, మోహన్ బాబు కలిసి నటించి ఇరువురి అభిమానులని ఎంతగానో అలరించారు.

అలాంటి ప్రభాస్ గురించి రీసెంట్ గా మంచు లక్షి(manchu lakshmi)ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతు ప్రభాస్ ని ఎవరైనా సరే అడగటం ఆలస్యం, ఓకే చేసేద్దామని అంటాడు, కొన్ని సంవత్సరాల క్రితం టీచ్ ఫర్ ఛేంజ్‌ అనే స్వచ్చంద సంస్థ కోసం ప్రభాస్ ని హెల్ప్‌ అడగడం జరిగింది.అంతే ఇక వెంటనే ఎంత డబ్బు కావాలి అని అడగటంతో షాక్ కి గురయ్యాను. నాకు డబ్బు అక్కర్లేదని, మీ సోషల్‌ మీడియా ప్లాట్‌ ఫాం ద్వారా సంస్థ గురించి ఒక పోస్ట్‌ చెయ్యమని అడిగాను. నాన్న గారికి ప్రభాస్ చాలా క్లోజ్‌. ఇద్దరూ రెగ్యులర్‌గా మాట్లాడుకోవడం జరుగుతుంది. మా ఫ్యామిలీ కోసం ప్రభాస్‌ ఏది అడిగినా చెయ్యడానికి ముందుకొస్తాడని చెప్పుకొచ్చింది.

ప్రభాస్‌ ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో చేస్తున్న రాజాసాబ్‌(raja saab)చిత్రం షూటింగ్ తో బిజీగా ఉన్నాడు.ఎంటైర్ తన సినీ కెరీర్ లోనే ఫస్ట్ టైం ఈ మూవీ ద్వారా ప్రభాస్ హర్రర్ అండ్ కామెడీ జోనర్ ని టచ్ చెయ్యబోతున్నాడు. ఆల్రెడీ ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా రిలీజైన టీజర్ ఒక రేంజ్ లో ఉండటంతో, రాజా సాబ్ పై ప్రభాస్ ఫ్యాన్స్ లోను, ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలు ఏర్పడ్డాయి.నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ పది న ఆ మూవీ విడుదల కానుండగా, సీతారామం ఫేమ్ హను రాఘవపూడి మూవీతో పాటు స్పిరిట్‌, సలార్‌ 2, కల్కి 2 సినిమాలు లైన్‌లో ఉన్నాయి.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.