English | Telugu

మంచు ల‌క్ష్మి సమ్‌థింగ్ స్పెష‌ల్‌!

మంచువారి అమ్మాయి ల‌క్ష్మి.. ఇప్పుడు దొంగాట అడుతోంది. అదేనండీ... దొంగాట అనే సినిమాలో న‌టిస్తోంది. నిర్మాత కూడా ఆమే. అడ‌వి శేష్ హీరో. అయితే ఓ పాట‌లో ల‌క్ష్మి ఐదుగురు హీరోల‌తో ఆడిపాడ‌బోతోంది. ఆ హీరోలు ఎవ‌రనుకొంటున్నారు..?? నాగార్జున‌, ర‌వితేజ‌, నాని, శింబు, రానా. ఓ పాట‌లో ఈ ఐదుగురు హీరోలూ క‌నిపిస్తార‌ట‌. వాళ్ల‌తో ల‌క్ష్మి డాన్స్ చేస్తుంద‌ట‌. ఈ సినిమా మొత్తానికి ఈ పాట స్పెష‌లాఫ్ ఎట్రాక్ష‌న్ గా నిల‌వ‌బోతోంద‌ని తెలుస్తోంది. అంతే కాదు.. ఈ పాట‌లో తాప్సి కూడా క‌నిపించ‌నున్న‌ద‌ని స‌మాచార‌మ్‌. ఒకే సినిమాలో ఇంత‌మంది గెస్ట్‌లా?? మంచు ల‌క్ష్మి ఏం చేసినా సమ్‌థింగ్ స్పెష‌ల్‌గా ఉండాలి క‌దా.??? అందుకే ఈ ప్ర‌య‌త్నం చేస్తోంది. మ‌రి ఈ ఐదుగురు హీరోల పాట ఏ స్థాయిలో ఉంటుందో...?? వెయిట్ అండ్ సీ.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.