English | Telugu

సెకండ్ సాంగ్ రిలీజ్ టైం ఇదేనా!.. ఆ సాంగ్ కి పోటీగా తెస్తున్నారా!

-సెకండ్ సాంగ్ రిలీజ్ డేట్ ఇదే
-ఆ సాంగ్ కి పోటీ తప్పదా
-అభిమానులు వెయిటింగ్
-చిరంజీవి, వెంకటేష్ ఎలా కనిపించనున్నారు

మెగాస్టార్ 'చిరంజీవి'(Chiranjeevi)అప్ కమింగ్ మూవీ 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)రాక కోసం అభిమానులతో పాటు ప్రేక్షకులు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. సుదీర్ఘ కాలం తర్వాత చిరంజీవి చేస్తున్న ఫ్యామిలీ ఎంటర్ టైనర్ కావడం, సదరు జోనర్ కి బ్రాండ్ అంబాసిడర్ గా మారిన అనిల్ రావిపూడి(Anil ravipudi) దర్శకుడు కావడంతో 'మన శంకర వరప్రసాద్ గారు' పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. పైగా విక్టరీ వెంకటేష్(venkatesh)కూడా స్క్రీన్ షేర్ చేసుకోవడంతో వెంకటేష్ అభిమానులు కూడా మూవీ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

చిరంజీవి సినిమాల్లో సాంగ్స్ అంటే ఎంతగా మెప్పిస్తాయో తెలిసిందే. అందుకు తగ్గట్టే 'మన శంకర వరప్రసాద్ గారు' నుంచి వచ్చిన మొదటి సాంగ్ 'మీసాల పిల్ల' ట్యూన్ పరంగా గాని లిరిక్స్ పరంగా ఎంతో క్యాచీగా ఉండటంతో అందరకి ఎంతో బాగా నచ్చింది. దీంతో మిగతా సాంగ్స్ కోసం అందరు వెయిట్ చేస్తున్నారు. రీసెంట్ గా ఫిలిం సర్కిల్స్ లో వినిపిస్తున్న కథనాల ప్రకారం నవంబర్ చివరి వారంలో సెకండ్ సాంగ్ ని రిలీజ్ చేయాలనే ప్లాన్ లో మేకర్స్ ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. సదరు సాంగ్ డ్యూయట్ సాంగ్ అని మీసాల పిల్ల కి గట్టి పోటీ ఇస్తుందనే టాక్ కూడా వినపడుతుంది. మరి ఈ వార్తే కనుక నిజమైతే మెగా ఫ్యాన్స్ కి ఈ నెల చివర్లో పండగ వాతావరణం వచ్చినట్లే. ఇక సెకండ్ సాంగ్ న్యూస్ సోషల్ మీడియాలో కూడా వస్తుండటంతో మీసాల పిల్ల సాంగ్ ప్రమోషన్ ని ఆ సాంగ్ పాడిన ఉదిత్ నారాయణతో వినూత్నంగా నిర్వహించారు.

also read: గ్లోబ్ ట్రోటర్, వారణాశి, రాముడు.. వారణాసి కథ ఇదేనా!


మరి సెకండ్ సాంగ్ ఎవరు పాడారు. ఈ సారి ప్రమోషన్ ఎలా ఉండబోతుందో అని సోషల్ మీడియా వేదికగా అభిమానులు,పాటల ప్రేమికులు చెప్పుకుంటున్నారు. భీమ్స్(Bheems)సంగీత సారధ్యంలో మన శంకర్ వర ప్రసాద్ గారు తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వస్తున్న మన శంకర వరప్రసాద్ గారు ని సుస్మిత కొణిదెల, సాహు గారపాటి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నయనతార(Nayanthara)హీరోయిన్ కాగా చిత్ర పరిశమ్రకి సంబంధించిన అతిరథ మహారధులు మన శంకర వర ప్రసాద్ గారు లో కనువిందు చేయనున్నారు.


టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .