English | Telugu

మ‌హేష్ త‌న టార్గెట్ రీచ్ అవుతాడా??

బ్లాక్‌బస్ట‌ర్ హిట్ కొట్ట‌డం మ‌హేష్ బాబుకి కొత్త కాదు. కానీ.. ఇప్పుడు మాత్రం అత్య‌వ‌స‌రం. ఎందుకంటే వ‌రుస‌గా రెండు ఫ్లాపుల‌తో అభిమానుల్ని నిరాశ ప‌రిచాడు. ఈసారి మాత్రం గురి త‌ప్ప‌కూడ‌ద‌న్న అప్ర‌మ‌త్త‌త‌తో శ్రీ‌మంతుడు చేశాడు. మార్కెట్ వ్యూహాల్ని బాగానే ఒంట‌బ‌ట్టించుకొన్న మ‌హేష్ ఈ సినిమాని త‌మిళంలోనూ భారీ ఎత్తున విడుద‌ల చేశాడు. నిర్మాణ భాగ‌స్వామి కావ‌డంతో ద‌గ్గ‌రుండి ప్ర‌చారం చేశాడు. న‌మ్ర‌త కూడా త‌న వంతు ప్ర‌య‌త్నాలు చేసింది. క‌థ‌లో లోపాలున్నా, సినిమా స్లోగా `సాగినా` తొలి రోజు హిట్ టాక్ ద‌క్కించుకోగ‌లిగింది. సినీ సెల‌బ్రెటీలు శ్రీ‌మంతుడుని ఆహా... ఓహో అంటూ పొగిడేస్తున్నారు. మొత్తానికి ఈ సినిమా బాక్సాఫీసు ద‌గ్గ‌ర నిల‌బ‌డిపోయిన‌ట్టే అంటున్నాయి ట్రేడ్ వ‌ర్గాలు. తొలి రోజు రూ.15 కోట్ల వ‌ర‌కూ వ‌సూలు చేసింద‌ని టాక్‌.

మ‌హేష్ టార్గెట్ మాత్రం వంద కోట్లు. త‌న కెరీర్‌లో తొలి వంద కోట్ల సినిమాగా శ్రీ‌మంతుడుని నిల‌పాల‌న్న ధ్యేయంతో ఉన్నాడు. సినిమా ఎలాగూ హిట్ట‌య్యింది, దానికి తోడు బాక్సాఫీసు ద‌గ్గ‌ర మ‌రో పెద్ద సినిమా రావాలంటే క‌నీసం రెండు వారాలు ప‌డుతుంది. ఈ లోగా వ‌సూళ్లు ద‌క్కించుకోగిలిగితే.. వంద కోట్ల మైలు రాయి అందుకోవ‌డం పెద్ద క‌ష్ట‌మేమీ కాదు. పైగా ఇది ఫ్యామిలీ ఓరియోంటెడ్ స‌బ్జెక్ట్‌.
కుటుంబ ప్రేక్ష‌కులు క‌ల‌సి క‌ట్టుగా వ‌స్తే.. ఈసినిమాని వంద కోట్ల క్ల‌బ్‌లో చూడొచ్చు.

అయితే బీసీ సెంట‌ర్ల‌లో ఈ సినిమా ఎంత వ‌ర‌కూ ఎక్కుతుందా అనేది ఇప్ప‌టికీ అనుమానంగానే ఉంది. సినిమా మ‌రీ స్లోగా ఉండ‌డంతో... రిపీట్ ఆడియ‌న్స్ ఉండ‌డం క‌ష్టం. తెలుగు సినిమాకి పెద్ద బ‌లం బీ, సీ ఆడియ‌న్స్‌. వాళ్ల‌కు ఈ సినిమా అంత‌గా న‌చ్చే అవ‌కాశం లేదు. బీ, సీల సపోర్ట్ ఏమాత్రం ఉన్నా.. మ‌హేష్ త‌న టార్గెట్ రీచ్ అవ్వ‌డం ఖాయం.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.