English | Telugu
మహేష్, బాలయ్య కాంబినేషన్‌లో కొత్త రికార్డు
Updated : Jun 4, 2014
సినిమా కలెక్షన్లతో పాటు శాటిలైట్ రైట్ల విషయంలోనూ ఇప్పుడూ కొత్త రికార్డులు నెలకొల్పుతున్నారు మన పరిశ్రమలో. లేటెస్టుగా మహేష్, బాలకృష్ణ ఇలాంటి ఒక రికార్డు తమ పేరున నమోదు చేసేశారు. వీరిద్దరి సినిమాలకు కలిపి ఒక చానల్ వారు 16 కోట్లు ఆఫర్ చేశారట. మహేష్ బాబు ‘ఆగడు’, బాలకృష్ణ ‘లెజెండ్’ఇవి రెండూ చిత్రాలు కూడా 14 రీల్స్ బ్వానర్ పై నిర్మించారు. ఈ సినిమాల రైట్స్ కొనేందుకు జెమినీ ముందుకొచ్చిందని సమాచారం. టీవిలో ప్రసారానికి ఇంత డబ్బు వెచ్చిస్తున్నారంటే, శాటిలైట్ రైట్స్ విషయంలో నెలకొన్న పోటీ గురించి, అలాగే ఆ హీరోలకున్న మార్కెట్ గురించి అంచనా వేయొచ్చు. పైరసీ వల్ల కలెక్షన్ల విషయంలో ఏదైనా నష్టం వచ్చిందనుకున్న, శాటిలైట్ రైట్స్ మంచి రేటుకు అమ్ముడైతో ఆ నష్టం భర్తి అయినట్లే. సో లేటెస్ట్‌గా నందమూరి సింహం, ప్రిన్స్ మహేష్ ఈ కొత్త రికార్డు శాటిలైట్ హిస్టరీకి ఇచ్చేశారు.