English | Telugu

విజ‌య్ ఇంట్లో లియో షూటింగ్‌

ఇళ‌య‌ద‌ళ‌ప‌తి విజ‌య్ హీరోగా న‌టిస్తున్న సినిమా లియో. లోకేష్ క‌న‌గ‌రాజ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఇటీవ‌ల ఈ సినిమా షూటింగ్ క‌శ్మీర్‌లో జ‌రిగింది. ప్ర‌స్తుతం చెన్నైలో షూటింగ్ జ‌రుగుతోంది. ఈ సినిమాను సెవ‌న్ స్క్రీన్ స్టూడియో ప‌తాకంపై ఎస్ ఎస్ లలిత్ కుమార్ తెర‌కెక్కిస్తున్నారు. త్రిష‌, ప్రియా ఆనంద్ నాయిక‌లు. అర్జున్‌, సంజ‌య్ ద‌త్‌, గౌత‌మ్ వాసుదేవమీన‌న్‌, మిస్కిన్‌, మ్యాథ్యూ థామ‌స్‌తో పాటు ప‌లువురు ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. కశ్మీర్‌లో జ‌రిగిన షూటింగ్‌లో మిస్కిన్ పార్ట్ పూర్త‌యింది. చెన్నై షెడ్యూల్‌తో గౌత‌మ్ వాసుదేవ‌మీన‌న్ షెడ్యూల్ పూర్త‌యిపోతుంది. ప్ర‌స్తుతం చెన్నైలో జ‌రుగుతున్న షూటింగ్ పూర్తి కాగానే యూనిట్ మొత్తం హైద‌రాబాద్‌కి షిఫ్ట్ అవుతుంది. ఆల్రెడీ హైద‌రాబాద్ అన‌గానే అంద‌రికీ రామోజీ ఫిల్మ్ సిటీ గుర్తుకొస్తుంది.

ఇప్పుడు లియో సినిమా కోసం అక్క‌డే ఓ సెట్ వేసిన‌ట్టు స‌మాచారం. అది విజ‌య్ ఇంటి సెట్ అట‌. అక్టోబ‌ర్ 19న లియో విడుద‌ల‌వుతుందని ఆల్రెడీ ప్ర‌క‌టించారు మేక‌ర్స్ వేలాది మంది జూనియ‌ర్ ఆర్టిస్టుల‌తో తెర‌కెక్కిస్తున్నారు. ఆల్రెడీ విజ‌య్ - లోకేష్ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన మాస్ట‌ర్ తెలుగువారికి కూడా చాలా న‌చ్చింది. ఇప్పుడు తెర‌కెక్కుతున్న లియో దాన్ని మించేలా ఉంటుంద‌ని టాక్‌. విజ‌య్ ఫ్యాన్స్ అప్‌డేట్ చెప్ప‌మంటూ మిమ్మ‌ల్ని కొట్టినా కొట్టొచ్చు. కానీ ఎట్టిప‌రిస్థితుల్లోనూ చెప్ప‌కండి అంటూ గౌత‌మ్ వాసుదేవ‌మీన‌న్‌తో చెప్పార‌ట లోకేష్ క‌న‌గ‌రాజ్‌. కానీ ఎప్పుడూ సినిమాలోని గెట‌ప్‌ల‌ను దాచిపెట్టే విజ‌య్ మాత్రం, ఈ సారి దాన్ని దాటేశారు. లియో లుక్‌తోనే బ‌య‌ట క‌నిపిస్తున్నారు. అయితే లియోలో సేమ్ గెట‌ప్ ఉంటుందా? స‌ర్‌ప్రైజ్‌గా మ‌రేదైనా ఎలిమెంట్‌ని యాడ్ చేస్తారా? అనేది వేచి చూడాల్సిందే.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.