English | Telugu
‘ఖుషి’ విషయంలో ఇంట్రస్టింగ్ న్యూస్!
Updated : Feb 27, 2023
సమంత హీరోయిన్‌గా విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న చిత్రం ఖుషి. ఈ చిత్రం షూటింగ్ ఇప్పటికే పూర్తయి ఉండాల్సింది. కానీ సమంతకు మయోసైటీస్ వ్యాధి రావడం నాగచైతన్యత విడాకుల నేపథ్యంలో ఈ సినిమా వాయిదా పడింది. ఇంక సమంత తాజాగా మయోసైటీస్ నుంచి కోలు కున్నట్టు కనిపిస్తోంది. ఇటీవల సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేసిన వీడియోలు ఫోటోలు చూస్తుంటే ఆమె మరలా ఫిట్ గాఉన్నట్టు అర్థమవుతుంది. ఇప్పటికే పలుమార్లు సమంతా వలన ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది. కానీ ఈసారి మాత్రం ఎలాంటి వాయిదాలు లేకుండా సినిమాలు పూర్తి చేయాలని యూనిట్ భావిస్తోంది.ఈ రోజు రేపు విజయ్ దేవరకొండ మీద సోలోగా వచ్చే కొన్ని ఎపిసోడ్స్ ను చిత్రీకరించనున్నారు.
ఆ తర్వాత మార్చి 8 నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుంది. ఇందులో సమంత విజయ్ దేవరకొండ మధ్య కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. విశాఖపట్నం కేరళలోని అలిపి వంటి ప్రాంతాలలో ఈ చిత్రం షూటింగ్ జరుగునున్నారు. నిన్ను కోరి, మజిలీ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన శివానిర్వాన ఈ చిత్రానికి దర్శకుడు. షైన్ స్క్రీన్స్ బ్యానర్ మీద ఈ సినిమా రూపొందుతోంది.సాహూ గారపాటి హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు. మరోవైపు సమంత సీటా డీల్ అనే వెబ్ సిరీస్ లో నటిస్తోంది. దాంతో ఈమె ఖుషీ సినిమా షూటింగ్లో పాల్గొనడం తధ్యమని తెలుస్తోంది. సినిమా షూటింగ్ను త్వరగా పూర్తిచేసి పోస్టుప్రొడక్షన్ పై దృష్టిపెట్టే అవకాశం ఉంది. సమాంత కారణంగా అనేకసార్లు ఈ చిత్రం షూటింగ్ వాయిదా పడింది.ఈసారి కచ్చితంగా వస్తానని చెప్పడంతో షెడ్యూల్స్ ను ఖరారు చేసుకున్నారు. మరి ఈసారైనా షూటింగు పూర్తిచేసుకుని ఖుషి సినిమా పోస్ట్ ప్రొడక్షన్కి వెళ్తుందా లేదా అనేది వేచి చూడాలి.