English | Telugu
విజయ్ పూర్తిగా పాలిటిక్స్ లోకి వెళ్లే ముందు ఆ డైరెక్టర్ తోనేనా సినిమా
Updated : Nov 10, 2023
ఇళయ దళపతి విజయ్ కి తమిళనాడులో ఉన్న క్రేజ్ గురించి అందరికి తెలుసు. లేటెస్టుగా విజయ్ నుండి వచ్చిన లియో మూవీ టాక్ తో సంబంధం లేకుండా తమిళనాడు లో రికార్డు స్థాయి కల్లెక్షన్లని సృష్టించింది. ఆ సందర్భంగా చిత్ర బృందం లియో సక్సెస్ మీట్ ఫంక్షన్ ని చాలా గ్రాండ్ గా నిర్వహించింది. ఆ ఫంక్షన్ లో విజయ్ ఇన్ డైరెక్టుగా త్వరలోనే పూర్తి స్థాయి రాజకీయాల్లో పాల్గొనబోతున్నాననే హింట్ ఇచ్చాడు. దాంతో ఇప్పుడు విజయ్ వరుసగా చెయ్యబోయే సినిమాల గురించి తమిళనాడులో చర్చ నడుస్తుంది.
తమినాడు చిత్ర పరిశ్రమలో కార్తీక్ సుబ్బరాజ్ కి మంచి క్రియేటివ్ డైరెక్టర్ అనే పేరు ఉంది. పిజ్జా , జిగర్తాండ మూవీలే అందుకు ఉదాహరణ. సుబ్బరాజ్ తాజాగా లారెన్స్, ఎస్ జె సూర్య లతో జిగర్తాండ మూవీ కి సీక్వెల్ గా జిగర్తాండ డబుల్ ఎక్స్ మూవీని తెరకెక్కించి మంచి హిట్ ని కూడా అందుకున్నాడు. ఇక అసలు విషయానికి వస్తే. తాజాగా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో కార్తీక్ సుబ్బరాజ్ మాట్లాడుతూ నా దగ్గర విజయ్ సార్ ఇమేజ్ కి సరిపడే మంచి కథ ఉందని పూర్తి స్థాయి స్రిప్ట్ తో ఆ కథ సిద్ధంగా ఉందని చెప్పాడు. కార్తీక్ సుబ్బరాజ్ ఇలా ప్రకటించాడో లేదో అప్పుడే తమిళ నాట ఆ సినిమా గురించి చర్చ మొదలయ్యింది. విజయ్ పొలిటికల్ ఎంట్రీ కి పూర్తి సమయం కేటాయించే ముందు కార్తీక్ సుబ్బరాజ్ అండ్ విజయ్ ల సినిమా ఉండవచ్చని తమిళనాడు లో మాట్లాడుకుంటున్నారు.
మొన్న వచ్చిన లియో విజయ్ కి 67 వ సినిమా. ఇప్పడు తన 68 వ సినిమాగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో విజయ్ సినిమా చెయ్యబోతున్నాడు.ఈ మేరకు అధికారకంగా ప్రకటన కూడా వచ్చింది. మరి కార్తీక్ సుబ్బరాజ్ విజయ్ కి తన దగ్గర ఉన్న కథ చెప్పి విజయ్ తదుపరి చిత్రానికి తనే దర్శకుడు అవుతాడేమో చూడాలి.