English | Telugu

జ్యోతిల‌క్ష్మి స‌గం ఊడ్చేసింది

వేశ్య‌గా ఛార్మి, జ్యోతిల‌క్ష్మిలాంటి మాంచి మాస్ టైటిల్ - పూరి ద‌ర్శ‌కుడు, నిర్మాత‌గా ఛార్మి! ఓ సినిమా జ‌నం దృష్టిలో ప‌డ‌డానికి ఇంకేం కావాలి. పైగా పోస్ట‌ర్లు, టీజ‌ర్లు కూడా క‌వ్వించేలానే ఉన్నాయి. దాంతో జ్యోతిల‌క్ష్మి ఇర‌గాడేస్తుంది అనుకొన్నారంతా. తొలి రోజు ఓ మాదిరి వ‌సూళ్లు ద‌క్కించుకొన్న జ్యోతిల‌క్ష్మి... ఆ త‌ర‌వాత పూర్తిగా ప‌డిపోయింది.

ఆంధ్ర‌, నైజాం, సీడెడ్‌.. ఎక్క‌డా త‌గిన‌న్ని వ‌సూళ్లు రాబ‌ట్టుకోలేదు. లేడీ ఓరియెంటెడ్ సినిమాని ఇన్ని థియేట‌ర్ల‌లో రిలీజ్ చేయ‌డం ఓ రికార్డ్‌... అంటూ ఊద‌ర‌గొట్టిన చిత్ర‌బృందం ఈసినిమా వ‌సూళ్లు చూసి బేర్‌మంది. మూడ్రోజుల త‌ర‌వాత‌.. జ్యోతిల‌క్ష్మి ద‌గ్గ‌ర ప్రేక్ష‌కులే క‌రువ‌య్యారు. 'ఇది ఫ్యామిలీ సినిమా', 'ఆడాళ్ల‌పై మీకు ఏమాత్రం గౌర‌వం ఉన్నా చూడాల్సిందే' అని ప్ర‌చారంతో జ‌నాల్ని, ఫ్యామిలీ ఆడియ‌న్స్‌నీ థియేట‌ర్ల‌కు రప్పించాల‌న్న ప్ర‌య‌త్నాలూ ఫ‌లించ‌లేదు. ఈ సినిమాని రూ.15 కోట్ల‌కు అమ్ముకొంది టీమ్‌.

అయితే అందులో స‌గం డ‌బ్బులూ రాలేదు. పంపిణీదారులు 'మేం న‌ష్ట‌పోయాం.. డ‌బ్బులు క‌ట్ట‌లేం' అంటూ అడ్డుప‌డుతున్నార‌ట‌. దాంతో పూరి అండ్ టీమ్‌కి ఏం చేయాలో పాలుపోవ‌డం లేదు. మొత్తానికి జ్యోతిల‌క్ష్మి వ‌ల్ల ఛార్మి, పూరి బాగుప‌డ్డారేమో గానీ, సినిమా కొన్న‌వాళ్లంతా స‌గానికి స‌గం పోగొట్టుకొన్నార‌ని ట్రేడ్ టాక్‌.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.