English | Telugu

లెజెండ్ ఆడియోలో జగపతి పవర్ డైలాగ్స్

"సింహ" వంటి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం తర్వాత బాలయ్య, బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న "లెజెండ్" చిత్ర ఆడియో విడుదల కార్యక్రమం నిన్న సాయంత్రం శిల్పకళావేదికలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా జగపతి బాబు మాట్లాడుతూ...

ఎన్నో సినిమాల్లో హీరోగా నటించాను. ఇపుడు ఈ సినిమాలో నన్ను విలన్ గా ఎంపిక చేసుకున్న బోయపాటి శ్రీనుకి కృతజ్ఞతలు. దేవిశ్రీప్రసాద్ అదిరిపోయే సంగీతం అందించాడు. ఒకసారి నా సినిమాకు కూడా మ్యూజిక్ చేయమని అడిగాను కానీ కుదరలేదు. బాలయ్య సినిమాలో నేను విలన్ గా చేస్తున్న ఈ సినిమాకు దేవి సంగీతం అందించడం ఆనందంగా ఉంది. ఈ కథ చెప్పక ముందే ఈ సినిమా లైన్ విని మాత్రమే ఒప్పుకున్నాను. అంత నచ్చింది. నేను ,ముక్కుసూటిగా మాట్లాడతాను. అనవసరంగా పొగడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ సినిమా తరువాత నాకు బోలెడన్ని అవకాశాలు వస్తాయి.

దర్శకుడు బోయపాటి నన్ను విలన్ గా చూపించడానికి నాతో బూతులు మాట్లాడి, నాలో విలన్ పాత్రను బయటకి తెచ్చేవాడు. ఈ చిత్ర నిర్మాతలతో పనిచేయడం నాకు చాలా సంతోషంగా ఉండి. ఒకప్పుడు నేను బ్రోకర్స్ కోసం చేశాను కానీ ఇపుడు మేకర్స్ కోసం చేస్తున్నాను. దానికి చాలా సంతోషంగా ఉంది. ఇక బాలయ్య బాబు అప్పట్లో ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అలాగే మంచితనం, ఎనర్జీ అలాగే ఉన్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో బాలయ్య బాబు లేనప్పుడు చిత్ర యూనిట్ కి నేను చెప్పాను.."ఆయన ముందు నన్ను బాబు అని పిలవకండి. అయన మీద గౌరవం తగ్గుతుంది. జేపి అని పిలవండి అని రిక్వెస్ట్ చేశాను. కానీ ఆ చిత్ర యూనిట్ "బాలయ్య బాబే మిమ్మల్ని బాబు అని పిలుస్తున్నారు ఇక మేమేం చేయాలి బాబు" అని అన్నారు. ఇదంతా కూడా ఆయన మంచితనం, సంస్కారం.

ఇక డైలాగుల విషయానికొస్తే... ఈ సినిమాలో నా పేరు జితేంద్ర. "జితేంద్ర ఇంటికొచ్చాడు. బెయిలు మీద ఇంటికొచ్చాడు. ఏం పిక్కుంటాడో పిక్కోమను" అని నేను డైలాగ్ చెప్తే దొరికిందే ఛాన్స్ అనుకొని ఒక పీకు పీకి పక్కనపడేసారు. ఇందులో బాలయ్యది ఒక డైలాగ్ ఉంది. " రాజకీయాలు మీ ఫుడ్డు మీద ఉంటుందేమో, మీరు పడుకునే బెడ్డు మీద ఉంటుందేమో కానీ మా బ్లడ్డులోనే ఉందిరా బ్లెడీ ఫూల్..." అని అంటారు. నేను ఈ సినిమాలో క్రుయల్ విలన్. కానీ చివరికి వచ్చేసరికి మాత్రం" ఏదైనా వాడు లెజెండ్ రా". "డిక్టేటర్... శాసించడం తప్ప ఆశించడు" "వాడి కంట్లోను పవరే, ఒంట్లోను పవరే, ఇంట్లోను పవరే... ముట్టుకుంటే మాడిపోతావ్"

ఇలాంటి పవర్ పుల్ డైలాగ్స్ ఉన్నాయి ఈ సినిమాలో కానీ ఎప్పటికీ మేము స్నేహితులమే. కానీ ఇప్పటివరకు బాలయ్య బాబుని చూసి ఒక యాక్టర్ అనుకున్నాను కానీ ఇపుడు న్యూక్లియర్ రియాక్టర్ అని అర్థమైపోయింది అని అన్నారు.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.