English | Telugu
బాహుబలి మగధీరకు సీక్వెల్?
Updated : Jun 4, 2015
రాజమౌళికి మగధీర వాసన పోలేదా? అటు ఇటుగా మగధీరకు సీక్వెల్ తీస్తున్నాడా? బాహుబలి ట్రైలర్ చూసనవారంతా ఇదే విషయంపై డిస్కస్ చేసుకుంటున్నారు. సైనికాధిపతిగా లుక్, రాజ్యం, వార్ ఎపిసోడ్ ఇలా ప్రతి విషయంలోనూ పోలిక కనిపిస్తోందంటున్నారు. ఈ వాదనకు బలం చేకూర్చిన మరో ముఖ్యమైన విషయం ఏంటంటే బాహుబలి కూడా పునర్జన్మల నేపథ్యంలో తెరకెక్కినట్టుందని చర్చించుకుంటున్నారు. ఎందుకంటే బాహుబలి ట్రైలర్లో ప్రభాస్ 'నేనెవర్ని' అని ప్రశ్నించడం ఈ వాదనకు ఊతమిస్తోంది. అంతో ఇంతో ఉన్న కాస్త తేడా ఏంటంటే మగధీర కన్నా బాహుబలి విజువల్ బెటర్ గా ఉందంటున్నారు. అయితే సినిమా ఫస్ట్ లుక్ నుంచి పోస్టర్ వరకూ కాపీ మాస్టర్ గా విమర్శలు ఎదుర్కొన్న రాజమౌళికి బాహుబలి ఎలాంటి ట్రీట్ ఇస్తుందో వెయిట్ అండ్ సీ!