English | Telugu

ఇడ్లీ కొట్టు ఓటిటిలోకి వచ్చేసింది.. కానీ మీరు ఏం చేయాలో తెలుసా!

- ఇడ్లీ కొట్టు ఓటిటిలో
- ధనుష్ నట విశ్వరూపం
- ఇడ్లీ కొట్టు కథ ఏంటి?
- నిత్యామీనన్, షాలిని పాండే క్యారెక్టర్స్ పరిస్థితి


స్టార్ స్టేటస్ కోసం పాకులాడకుండా సిల్వర్ స్క్రీన్ పై ప్రయోగాలు చెయ్యడంలో ధనుష్(Dhanush)మొదటి వరుసలో ఉంటాడు. కానీ ప్రేక్షకులు స్టార్ స్టేటస్ ని కట్టబెట్టడంలో ఏ మాత్రం ఆలోచించలేదు. ధనుష్ ఒక క్యారక్టర్ లోకి పరకాయ ప్రవేశం చేసాడంటే ధనుష్ మనకి కనపడడు. మనకి తెలిసిన పొరుగింటి వ్యక్తి కనిపిస్తాడు. ధనుష్ పెర్ ఫార్మెన్స్ కి ఉన్న స్పెషాలిటీ అదే. అభిమాన ఘనం కూడా ఈ విషయంలో ధనుష్ వెనకే నడుస్తుంది. దీంతో పాన్ ఇండియా స్థాయిలో స్టార్ హీరోగా తన సత్తా చాటుతు వస్తున్నాడు.

విజయదశమి కానుకగా అక్టోబర్ 1 న 'ఇడ్లి కొట్టు'(Idli Kottu)తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తమిళంలో 'ఇడ్లి కడై'(Idli kadai)పేరుతో రిలీజయ్యింది. రెండు చోట్ల కూడా సినిమా బాగుందనే టాక్ వచ్చినా, కల్లెక్షన్స్ మాత్రం పెద్దగా రాలేదు. ఇప్పుడు ఈ మూవీ సైలెంట్ గా ఓటిటి లోకి అడుగుపెట్టింది. నెట్ ఫ్లిక్స్(Net Flix)వేదికగా ఈ రోజు నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. ఓటిటి మూవీ లవర్స్ కి ఇది గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. థియేటర్స్ లో మిస్ అయిన వారు కూడా ఓటిటిలో చూసి ఆనందించవచ్చు. మూవీ అయితే చాలా బాగుంటుంది. ఎక్కడ కూడా ఎలాంటి అసభ్యతకి తావు లేకుండా ఇంటిల్లిపాది చూసేలా సన్నివేశాలు ఉంటాయి. కొన్ని సన్నివేశాల్లో మనకి తెలియకుండానే కన్నీళ్లు వస్తాయి. మన పూర్వీకుల గతాన్ని కూడా గుర్తుచేస్తుంది.

Also Read: హీరోయిన్ గా పరిచయమవుతున్న మహేష్ బాబు మేనకోడలు.. పిక్స్ వైరల్


క్యారెక్టర్స్ పరంగా వస్తే తన ఆశయాన్ని తన కొడుకు నెరవేర్చాలని అనుకునే తండ్రి క్యారక్టర్ లో రాజ్ కిరణ్, కొడుకు క్యారక్టర్ లో ధనుష్ ల నటన ప్రతి ఒక్కర్ని కట్టిపడేస్తుంది. డబ్బు ఉందన్నా అహంకారంతో, స్వార్ధంతో ఎదుటివారి జీవితాలని నాశనం చేయాలనుకునే క్యారక్టర్ లలో సత్యరాజ్, అరుణ్ విజయ్ లు జీవించారు. పైగా ఈ ఇద్దరు కూడా తండ్రి కొడుకులే. హీరోయిన్స్ గా చేసిన నిత్యామీనన్(Nithya Menon),షాలిని పాండే(Shalini Pandey)క్యారెక్టర్స్ కి సంబంధించి ధనుష్ తీసుకున్న నిర్ణయం కూడా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. నటుడుగానే కాదు దర్శకుడుగా, నిర్మాతగాను ఇడ్లీ కొట్టు ద్వారా ధనుష్ మెప్పించాడని చెప్పవచ్చు.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.