English | Telugu

హస్తినాపురం ప్రయాణం మొదలైంది!

యంగ్ హీరో కార్తీక్ రాజు వరుస సినిమాలతో బిజీ అవుతున్నారు. అథర్వ రిలీజ్‌కు సిద్ధంగా ఉండగానే.. మరో చిత్రాన్ని పట్టాలెక్కించారు. కాసు క్రియేషన్స్ బ్యానర్ మీద కాసు రమేష్ నిర్మిస్తున్న ‘హస్తినాపురం’ అనే చిత్రంలో కార్తీక్ రాజు నటిస్తున్నారు. ఈ చిత్రంతో రాజా గండ్రోతు దర్శకుడిగా పరిచయమవుతున్నారు. తాజాగా ఈ మూవీ పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది.

హైదరాబాద్ లోని ఫిల్మ్ నగర్ దైవసన్నిధానంలో ‘హస్తినాపురం’ చిత్రాన్ని ప్రారంభించారు. తొలి సన్నివేశానికి భీమనేని శ్రీనివాసరావు క్లాప్ కొట్టగా, ప్రముఖ నిర్మాత వంశీ నందిపాటి కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ప్రముఖ దర్శకుడు వి.ఎన్.ఆదిత్య స్క్రిప్ట్ అందజేశారు.

ప్రారంభోత్సవం సందర్భంగా దర్శకుడు భీమనేని శ్రీనివాస్ మాట్లాడుతూ.. "మా కౌసల్యా కృష్ణమూర్తితో కార్తీక్ రాజుకు మంచి పేరు వచ్చింది. అథర్వ కూడా చాలా బాగుంటుంది. నేను చూశాను. ఈ చిత్రం కూడా పెద్ద హిట్టవ్వాలని కోరుకుంటున్నాను" అని అన్నారు.

దర్శకుడు వి.ఎన్.ఆదిత్య మాట్లాడుతూ.. "కౌసల్యా కృష్ణమూర్తి చూసి కార్తీక్ రాజుతో ఓ లవ్ స్టోరీని చేశాను. అది నెక్ట్స్ వాలెంటైన్స్ డేకి రాబోతోంది. అథర్వతో కార్తీక్ రాజు ఇమేజ్ మారబోతోంది. ఈ మూవీ కూడా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను" అని అన్నారు.

చిత్ర నిర్మాత కాసు రమేష్ మాట్లాడుతూ.. "కార్తీక్ రాజు వద్ద మేకప్ మెన్, మేనేజర్‌గా ఉండేవాడ్ని. ఆయన నన్ను నిర్మాతను చేశారు. మా డైరెక్టర్ రాజా వివి వినాయక్ వద్ద అసిస్టెంట్‌గా పని చేశారు. కథలో దమ్ముంది కాబట్టే నిర్మిస్తున్నాం. మా చిత్రాన్ని ఆదిరించండి" అని అన్నారు.

చిత్ర దర్శకుడు రాజా గండ్రోతు మాట్లాడుతూ.. "హస్తినాపురం అనే టైటిల్ వినగానే ఎంత పాజిటివిటీ ఉందో.. సినిమా కూడా అంతే ఉంటుంది. నా గురువు వినాయక్ గారి దగ్గర పని చేశాను. మంచి కథ, మంచి టీంతో రాబోతున్నాం. మా అందరినీ ఆదరిస్తారనే నమ్మకంతో ఉన్నాను. నా మీద నమ్మకంతో నన్ను పిలిచి అవకాశం ఇచ్చిన మా హీరో కార్తీక్ గారికి , నిర్మాత రమేష్ గారికి థాంక్స్" అని అన్నారు.

హీరో కార్తీక్ రాజు మాట్లాడుతూ.. "హస్తినాపురం కొత్త పాయింట్‌తో రాబోతోంది. రెగ్యులర్ చిత్రంలా ఉండదు. మా డైరెక్టర్ అద్భుతంగా కథ రాసుకున్నారు. మా మ్యూజిక్ డైరెక్టర్ అనుదీప్ ఆల్రెడీ హనుమాన్ సాంగ్‌తో ట్రెండింగ్‌లో ఉన్నారు. మా చిత్రాన్ని అందరూ ఆదరిస్తారని కోరుకుంటున్నాను" అని అన్నారు.

మ్యూజిక్ డైరెక్టర్ అనుదీప్ మాట్లాడుతూ.. "రాజా గారు ఓ మంచి కథతో రాబోతున్నారు. కార్తీక్ రాజుతో నాకు ఇది రెండో చిత్రం. ఈ చిత్రానికి పని చేయడం ఆనందంగా ఉంది. నాకు అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్" అని అన్నారు.

హీరోయిన్ నిషా మాట్లాడుతూ.. "తెలుగులో మళ్లీ సినిమాను చేస్తుండటం ఆనందంగా ఉంది. ఇలాంటి డిఫరెంట్ మూవీలో భాగస్వామి అయినందుకు సంతోషంగా ఉంది. నాకు అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్" అని అన్నారు.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.