English | Telugu
చరణ్ మామ 'రైమ్'తో అర్హ.. ఎంత క్యూట్ గా ఉందో!
Updated : Nov 18, 2023
రామ్ చరణ్, ఉపాసన దంపతుల దగ్గర 'రైమ్' అనే ఓ పెట్ డాగ్ ఉంది. బ్రౌన్ కలర్ లో ముద్దుగా ఉండే ఆ డాగ్ అంటే చరణ్ కి ఎంతో ఇష్టం. ఎక్కడికి వెళ్ళినా తన వెంట తీసుకొని వెళ్తుంటాడు. అంతేకాదు 'ఆల్వేస్ రైమ్' పేరుతో ఓ ఇన్ స్టాగ్రామ్ పేజీ కూడా ఉంది. అందులో రైమ్ ఫొటోలను షేర్ చేస్తుంటారు. తాజాగా ఆ క్యూట్ డాగ్ తో అల్లు అర్జున్ కుమార్తె అర్హ దిగిన ఫొటోలను పోస్ట్ చేయగా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఇటీవల మెగా హీరో వరుణ్ తేజ్ వివాహం ఇటలీలో జరిగిన సంగతి తెలిసిందే. ఈ వేడుకకు మెగా, అల్లు కుటుంబాలు హాజరయ్యాయి. ఇక చరణ్ తనతో పాటు రైమ్ ని కూడా ఇటలీ తీసుకెళ్లాడు. అక్కడ తన చరణ్ మామ పెట్ డాగ్ రైమ్ ని చూసిన అర్హ.. దానితో సరదాగా ఆడుకుంది. తన బుజ్జి చేతులతో రైమ్ ని ఎత్తుకొని మురిసిపోయింది. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాని ఊపేస్తున్నాయి. చరణ్, బన్నీ అభిమానులైతే ఈ ఫొటోలను చూసి తెగ సంబరపడుతున్నారు.