English | Telugu

'గాంఢీవధారి అర్జున' షూటింగ్ పూర్తి.. మెగా ప్రిన్స్ సందడి షురూ!

వైవిధ్యమైన సినిమాలు చేస్తూ తనదైన గుర్తింపు సంపాదించుకున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మరో డిఫరెంట్ మూవీతో మన ముందుకు రాబోతున్నాడు. ఆ సినిమాయే 'గాంఢీవధారి అర్జున'. స్టైలిష్ ఫిల్మ్ మేక‌ర్ ప్ర‌వీణ్ సత్తారు ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న‌ ఈ చిత్రంలో వ‌రుణ్ తేజ్ ప‌క్కా యాక్ష‌న్ మోడ్‌లో ఆక‌ట్టుకోబోతున్నాడు. సాక్షి వైద్య హీరోయిన్‌గా న‌టిస్తుంది.

వ‌రుణ్‌తేజ్ కెరీర్‌లో అత్యంత భారీ బ‌డ్జెట్‌తో ఎస్వీసీసీ ప‌తాకంపై బి.వి.ఎస్‌.ఎన్‌.ప్ర‌సాద్‌, బాపినీడు ఈ చిత్రాన్నినిర్మిస్తున్నారు. యూరోపియ‌న్ దేశాల‌తో పాటు యు.ఎస్‌.ఎలోనూ షూటింగ్‌ జరుపుకుంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా షూటింగ్ పూర్త‌య్యిందని మేకర్స్ తెలిపారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. ముందుగా ప్రకటించినట్లుగానే ఆగస్ట్ 25న ఈ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌ను గ్రాండ్ లెవ‌ల్లో విడుద‌ల చేస్తున్నట్లు పేర్కొన్నారు.

'గాంఢీవధారి అర్జున' షూటింగ్ పూర్త‌యిన విష‌యాన్ని తెలియ‌జేస్తూ మేకర్స్ ఓ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు. ఇందులో వ‌రుణ్ తేజ్ చేతిలో గ‌న్ ప‌ట్టుకుని చాలా స్టైలిష్‌గా క‌నిపిస్తున్నాడు. వ‌రుణ్‌తేజ్ ఈ చిత్రంలో సెక్యూరిటీ ఆఫీస‌ర్‌గా క‌నిపిస్తాడు. అత్యంత ప్ర‌మాద‌క‌ర‌మైన ప‌రిస్థితుల నుంచి ప్ర‌జ‌లను అత‌ను ఎలా కాపాడాడు, అత‌ని స్ట్రాట‌జీస్ ఏంటి? అనేది తెలుసుకోవాలంటే ఆగ‌స్ట్ 25 వ‌ర‌కు ఆగాల్సిందేనంటున్నారు మేక‌ర్స్‌. మిక్కీ జె.మేయ‌ర్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా ముఖేష్, ఆర్ట్ డైరెక్టర్ గా అవినాష్ కొల్ల వ్యవహరిస్తున్నారు.

ఇండియన్ సినిమా హిస్టరీలో ఇలాంటి సినిమా రాలేదు.. మారుతి ఏమంటున్నాడు

రెబల్ సాబ్ ప్రభాస్(Prabhas)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ పై తన కట్ అవుట్ కి ఉన్న క్యాపబిలిటీని రాజాసాబ్(The Raja saab)తో మరోసారి చాటి చెప్పాడు. ఇందుకు సాక్ష్యం రాజాసాబ్ తో తొలి రోజు 112 కోట్ల గ్రాస్ ని రాబట్టడమే.  ఈ మేరకు  మేకర్స్ కూడా ఈ విషయాన్ని అధికారకంగా ప్రకటిస్తూ పోస్టర్ ని కూడా రిలీజ్ చేసారు. దీంతో ప్రభాస్ అభిమానుల ఆనందానికి అయితే అవధులు లేవు. చిత్ర బృందం ఈ రోజు రాజా సాబ్ కి సంబంధించిన విజయోత్సవ వేడుకలు నిర్వహించింది. దర్శకుడు మారుతీ తో పాటు, నిర్మాత విశ్వప్రసాద్(TG Vishwa Prasad)రాజా సాబ్ హీరోయిన్స్ నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హాజరయ్యారు.

రాజాసాబ్ సర్కస్ 1935 .. సీక్వెల్ కథ ఇదేనా! 

పాన్ ఇండియా ప్రభాస్(Prabhas)అభిమానులు,ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రెబల్ మూవీ 'ది రాజాసాబ్'(The Raja saab)నిన్న బెనిఫిట్ షోస్ తో థియేటర్స్ లో ల్యాండ్ అయ్యింది. దీంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కళకళలాడుతున్నాయి. సుదీర్ఘ కాలం తర్వాత సిల్వర్ స్క్రీన్ పై వింటేజ్ ప్రభాస్ కనిపించడంతో ఫ్యాన్స్ ఆనందానికి అయితే అవధులు లేవు. రిజల్ట్ విషయంలో మాత్రం మిక్స్డ్ టాక్ వినపడుతుంది. రివ్యూస్ కూడా అదే స్థాయిలో  వస్తున్నాయి. కాకపోతే తెలుగు సినిమా ఆనవాయితీ ప్రకారం ఈ రోజు సెకండ్ షో కంప్లీట్ అయిన తర్వాత గాని అసలైన టాక్ బయటకి రాదు.