English | Telugu

గ‌బ్బ‌ర్ సింగ్ 2లో సీన్లు.. బెంగాల్ టైగ‌ర్‌లోకి..?

ప‌వ‌న్ క‌ల్యాణ్ సినిమా గ‌బ్బ‌ర్ సింగ్ 2 లో సీన్లు.. ర‌వితేజ బెంగాల్ టైగ‌ర్‌లో వాడేస్తున్నారా? అవున‌నే అంటున్నాయి ఫిల్మ్‌న‌గ‌ర్ వ‌ర్గాలు. గ‌బ్బ‌ర్ సింగ్ 2 కోసం రెండేళ్లు వ‌ర్క్ చేశాడు సంప‌త్ నంది. ఆ సినిమా సంప‌త్ చేజారిపోయింది. ఆ త‌ర‌వాత ర‌వితేజ‌ను ప‌ట్టుకొని బెంగాల్ టైగ‌ర్ అనే సినిమా తీస్తున్నాడు. నిజానికి గ‌బ్బ‌ర్ సింగ్ 2కి ఒక ద‌శ‌లో బెంగాల్ టైగ‌ర్ అనే పేరు పెడ‌దామ‌నుకొన్నారు.

ప‌వ‌న్ కోసం రాసుకొన్న ఆ క‌థ‌నే టైటిల్ తో స‌హా వాడుకొని ర‌వితేజ‌తో సినిమా చేస్తున్నాడ‌న్న ప్ర‌చారం అప్ప‌ట్లోనే వ‌చ్చింది. అయితే 'ఇది వ‌వ‌న్ క‌థ కాదు..' అని సంప‌త్ నంది కూడా కుండ బ‌ద్ద‌లుకొట్టిన‌ట్టు చెప్పాడు. అయితే ఇప్పుడు ఈ సినిమా గురించిన ఓ ఆస‌క్తిక‌రమైన నిజం బ‌య‌ట‌ప‌డింది.

గ‌బ్బ‌ర్ సింగ్ 2 కోసం రాసుకొన్న రెండు యాక్ష‌న్ సీక్వెన్స్‌ని ర‌వితేజ సినిమా కోసం వాడుకొన్నామ‌ని స్వ‌యంగా సంప‌త్ నందినే క్లారిటీ ఇచ్చేశాడు. అయితే క‌థ మాత్రం అది కాద‌ని, ర‌వితేజ కోసం ప్ర‌త్యేకంగా రాసుకొన్న స్టోరీ ఇద‌ని, అయితే బెంగాల్ టైగ‌ర్ టైటిల్ పెట్ట‌డానికి మాత్రం ఖుషీలో ప‌వ‌న్ డైలాగే స్ఫూర్తి అని సంత‌ప్ చెప్పుకొచ్చాడు.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.