English | Telugu

కిరణ్ అబ్బవరంకి పోటీగా 'GTA'తో వస్తున్న చైతన్య!

అక్టోబర్ 6న పలు సినిమాలు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. అందులో కిరణ్ అబ్బవరం 'రూల్స్ రంజన్', సుధీర్ బాబు'మామ మశ్చీంద్ర', 'మంత్ ఆఫ్ మధు', '800' వంటి సినిమాలు ఉన్నాయి. ఈ లిస్టులో యూత్ ను టార్గెట్ చేస్తూ వస్తున్న 'GTA' కూడా ఉంది.

చైతన్య పసుపులేటి, హీనా రాయ్ హీరో హీరోయిన్లు గా నటించిన సినిమా GTA. అశ్వత్థామ ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ సినిమాతో దీపక్ సిద్ధాంత్ దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు.

మార్క్ కె రాబిన్ సంగీతం అందించిన ఈ సినిమాకు గ్యారీ బి.హెచ్ ఎడిటర్. కె.వి.ప్రసాద్ ఈ సినిమాకు సినిమాటోగ్రఫీ అందించారు. నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తి చేసుకొని అక్టోబర్ 6న థియేటర్స్ లో విడుదల కానుంది.

ఈ చిత్ర విడుదల పోస్టర్ ను రచయిత దర్శకుడు కృష్ణ చైతన్య విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... "కొత్త కాన్సెప్ట్ తో రాబోతున్న GTA సినిమా విజయం సాధించాలని కోరుకుంటున్నాను. 90కిడ్స్ కు కనెక్ట్ అయ్యే విధంగా క్యాచీ టైటిల్ తో ఈ సినిమా రాబోతోంది" అన్నారు.

క్రైమ్ యాక్షన్ డ్రామా గా ఈ సినిమాను తెరకెక్కించడం జరిగింది. GTA అనే గేమ్ ను ఆధారంగా చేసుకొని ఈ సినిమాను తీయడం జరిగిందని దర్శకుడు దీపక్ సిద్ధాంత్ తెలిపారు.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.