English | Telugu

'ఫంకీ' రిలీజ్ డేట్ మారింది!

అనౌన్స్ చేసిన రిలీజ్ డేట్ కి సినిమాలు రాకపోవడం అనేది కామన్ అయిపోయింది. ఇటీవల కాలంలో ఎన్నో సినిమాలు పోస్ట్ పోన్ అవుతున్నాయి. అలాంటిది ఒక సినిమా మాత్రం.. ఊహించని విధంగా ప్రీ పోన్ అయ్యి ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. (Funky Movie)

విశ్వక్ సేన్ హీరోగా 'జాతి రత్నాలు' ఫేమ్ కె.వి. అనుదీప్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'ఫంకీ'. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని 2026, ఏప్రిల్ 3న విడుదల చేయనున్నట్లు.. నెల రోజుల క్రితం ప్రకటించారు. అయితే ఇప్పుడు ఈ సినిమాని అనూహ్యంగా ఫిబ్రవరిలో రిలీజ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేసి సర్ ప్రైజ్ చేశారు.

Also Read: బాలయ్య కెరీర్ బిగ్గెస్ట్ హిట్ దిశగా అఖండ-2

ప్రేమికుల దినోత్సవం కానుకగా ఒకరోజు ముందుగా 2026 ఫిబ్రవరి 13న 'ఫంకీ' సినిమాని విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ మధ్య కాలంలో ఇలా 50 రోజులు ముందుకి ప్రీ పోన్ అయిన సినిమా లేదనే చెప్పాలి.

ప్రీ పోన్ తో సర్ ప్రైజ్ చేసిన 'ఫంకీ'.. కంటెంట్ తోనూ అలాగే సర్ ప్రైజ్ చేస్తుందేమో చూడాలి. ఈ సినిమా ప్రేక్షకులకు నవ్వుల విందుని అందిస్తుందని చిత్ర బృందం చెబుతోంది. ఇప్పటికే విడుదలైన టీజర్ ఆకట్టుకుంది. టీజర్ లోని అనుదీప్ మార్క్ పంచ్ డైలాగ్ లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 'జాతి రత్నాలు' తరహలో అనుదీప్ మరోసారి మ్యాజిక్ చేస్తాడేమో చూడాలి.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.