English | Telugu

NTRNeel: ఎన్టీఆర్-నీల్ మూవీ అప్డేట్.. ఫ్యాన్స్ ఫైర్..!

జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ ఓ భారీ యాక్షన్ ఫిల్మ్ కోసం చేతులు కలిపిన సంగతి తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ మూవీకి 'డ్రాగన్' టైటిల్ పరిశీలనలో ఉంది. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ ప్రారంభమైంది. మొదట ఎన్టీఆర్ లేని కొన్ని సన్నివేశాలను షూట్ చేశారు. త్వరలో ఎన్టీఆర్ కూడా షూట్ లో పాల్గొనబోతున్నాడు.

ఎన్టీఆర్ ఏప్రిల్ 22 నుంచి షూట్ లో జాయిన్ కాబోతున్నట్లు మేకర్స్ తాజాగా అధికారికంగా ప్రకటించారు. ఏప్రిల్ 9న మధ్యాహ్నం 12:06 కి 'NTRNeel' మూవీ అప్డేట్ రాబోతుందని నిన్న మేకర్స్ తెలిపారు. దీంతో రిలీజ్ డేట్ కి సంబంధించిన లేదా మరేదైనా పెద్ద అప్డేట్ ఉంటుందని, అభిమానులు ఎంతగానో ఎదురుచూశారు. కానీ, ఎన్టీఆర్ షూట్ లో పాల్గొనబోతున్న అప్డేట్ కావడంతో ఫ్యాన్స్ కాస్త నిరాశ చెందారు. ఎందుకంటే ఈ నెలలో డ్రాగన్ షూటింగ్ లో ఎన్టీఆర్ జాయిన్ అవుతాడని ముందునుంచి ప్రచారం జరిగింది. దీంతో ఈ అప్డేట్ ఫ్యాన్స్ కి పెద్దగా కిక్ ఇవ్వలేదు.

'డ్రాగన్'ని 2026 సంక్రాంతికి విడుదల చేయనున్నట్లు గతంలో మేకర్స్ ప్రకటించారు. కానీ షూటింగ్ ఆలస్యంగా మొదలు కావడంతో.. ఈ చిత్రాన్ని 2026 ఏప్రిల్ 9న విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆ డేట్ కి ఇంకా సరిగ్గా ఏడాది సమయం ఉండటంతో.. ఈరోజు కొత్త రిలీజ్ ని రివీల్ చేస్తారని అందరూ భావించారు. కానీ, మూవీ టీం మాత్రం షూట్ అప్డేట్ తో సరిపెట్టింది.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.

ఓటిటి లో శంబాల రెస్పాన్స్ ఇదే.. ఇది అసలు రికార్డునే కాదు

 కొన్ని చిత్రాలు అంతే.. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి థియేటర్స్ దగ్గర జాతర వాతావరణాన్ని తీసుకొస్తాయి. అలాంటి వాతావరణాన్ని శంబాల(Shambala)తీసుకొచ్చింది. పైగా చిన్న చిత్రాలకి సరికొత్త ఊపిరిని తీసుకొచ్చి ఆది సాయికుమార్ కెరీర్ కే కాదు, తెలుగు చిత్ర పరిశ్రమకే సరికొత్త సినీ యవ్వనాన్ని తీసుకొచ్చింది. భారీ వసూళ్లని అవలీలగా సాధించిన శంబాల జనవరి 22 నుంచి ఆహా(Aha) వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే  . థియేటర్స్ లో లాగానే ఓటిటి వేదికగా సరికొత్త రికార్డ్స్ ని సెట్స్ చేస్తూ అందరు తనవైపు చూసేలా చేస్తుంది. మరి మనం కూడా సదరు రికార్డ్స్ పై లుక్ వేద్దాం