English | Telugu

అల్లు అర్జున్‌తో ‘దురంధర్‌’ డైరెక్టర్ భారీ చిత్రం.. ఎందుకు ఆగిపోయింది?

2019 ‘ఉరి: The Surgical Strike’ చిత్రంతో దర్శకుడుగా పరిచయమైన ఆదిత్యధర్.. మొదటి సినిమాతోనే అందరి ప్రశంసలు అందుకున్నారు. ఉత్తమ దర్శకుడుగా జాతీయ అవార్డు కూడా దక్కించుకున్నారు. ఆరేళ్ల గ్యాప్ తీసుకొని ఇటీవల ‘దురంధర్‌’ చిత్రంతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చారు. గత ఏడాది డిసెంబర్ 5న విడుదలైన ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌గా నిలిచి భారీ కలెక్షన్స్ సాధిస్తోంది. ఇప్ప్పుడు ‘దురంధర్‌2’ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారు.

2021లో ‘పుష్ప’ చిత్రంతో జాతీయ స్థాయిలో అల్లు అర్జున్‌కి మంచి పేరు వచ్చింది. అంతేకాదు, ఉత్తమ నటుడుగా జాతీయ అవార్డు కూడా అందుకున్నారు. దాంతో బాలీవుడ్‌కి చెందిన భారీ చిత్ర నిర్మాణ సంస్థలు బన్నీతో సినిమా చేసేందుకు ఆసక్తి చూపించాయి. అందులో భాగంగానే ఆదిత్య ధర్ తన డ్రీమ్ ప్రాజెక్ట్‌ని సెట్స్‌పైకి తీసుకెళ్లాలనుకున్నారు. బన్నీకి స్టోరీ కూడా నేరేట్ చేశారని తెలుస్తోంది. అశ్వత్థామ ప్రధాన పాత్రగా రాసుకున్న కథ అది. మొదట విక్కీ కౌశల్‌తో ఆదిత్య ఈ సినిమా చేస్తారని ప్రచారం జరిగింది.

ఆదిత్య మాత్రం అల్లు అర్జున్‌తో ఆ ప్రాజెక్ట్ చెయ్యాలని ప్రయత్నించారు. బన్నీకి కథ నచ్చి సినిమా చేసేందుకు ఓకే చెప్పారు. అయితే అదే సమయంలో ప్రభాస్, అమితాబ్, కమల్‌హాసన్ వంటి స్టార్స్‌తో నాగ్ అశ్విన్ ‘కల్కి 2898ఎడి’ చిత్రాన్ని ఎనౌన్స్ చేశారు. దాంతో అల్లు అర్జున్, ఆదిత్య ధర్ ప్రాజెక్ట్ ఆగిపోయింది. ఎందుకంటే ‘కల్కి’ పురాణాలను ఫ్యూచర్ వరల్డ్‌తో లింక్ చేస్తూ రూపొందించిన ఫిక్షనల్ సినిమా. అందులో కర్ణుడు, అర్జునుడు, కష్ణుడు వంటి పాత్రలతోపాటు అశ్వత్థామ పాత్ర ప్రధానంగా ఉంటుంది. 2024లో విడుదలైన ఈ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్ అయింది. ఇప్ప్పుడు ‘కల్కి2’ని తెరకెక్కించే పనిలో ఉన్నారు నాగ్ అశ్విన్.

అశ్వత్థామ కథను ‘కల్కి’లో ప్రేక్షకులు చూసేశారు. మళ్ళీ అదే కథతో సినిమా చేయడం కరెక్ట్ కాదని భావించిన ఆదిత్య, బన్నీ ఆ ప్రాజెక్ట్‌ని పక్కన పెట్టేశారని తెలుస్తోంది. తాజాగా ‘దురంధర్‌’ చిత్రం విడుదలైన తర్వాత ఆదిత్య ధర్ తన నెక్స్‌ట్ సినిమాను బన్నీ చేస్తారనే వార్త సోషల్ మీడియాలో వినిపిస్తోంది. అయితే ‘దురంధర్‌2’ తర్వాత వీరి కాంబినేషన్‌లో సినిమా ఉంటుందా, లేదా అనే విషయంలో క్లారిటీ వస్తుంది. బన్నీ కూడా తను కమిట్ అయిన ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉన్నారు. ఆదిత్య, బన్నీ తమ ప్రాజెక్టులు పూర్తి చేసిన తర్వాత కలిసి సినిమా చేస్తారేమో చూడాలి.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.

ఓటిటి లో శంబాల రెస్పాన్స్ ఇదే.. ఇది అసలు రికార్డునే కాదు

 కొన్ని చిత్రాలు అంతే.. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి థియేటర్స్ దగ్గర జాతర వాతావరణాన్ని తీసుకొస్తాయి. అలాంటి వాతావరణాన్ని శంబాల(Shambala)తీసుకొచ్చింది. పైగా చిన్న చిత్రాలకి సరికొత్త ఊపిరిని తీసుకొచ్చి ఆది సాయికుమార్ కెరీర్ కే కాదు, తెలుగు చిత్ర పరిశ్రమకే సరికొత్త సినీ యవ్వనాన్ని తీసుకొచ్చింది. భారీ వసూళ్లని అవలీలగా సాధించిన శంబాల జనవరి 22 నుంచి ఆహా(Aha) వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే  . థియేటర్స్ లో లాగానే ఓటిటి వేదికగా సరికొత్త రికార్డ్స్ ని సెట్స్ చేస్తూ అందరు తనవైపు చూసేలా చేస్తుంది. మరి మనం కూడా సదరు రికార్డ్స్ పై లుక్ వేద్దాం