English | Telugu

మహేష్ బాబు దూకుడు ఆడియో ఆగస్ట్ 9 న

మహేష్ బాబు "దూకుడు" ఆడియో ఆగస్ట్ 9 న విడుదల కానుందని తెలిసింది. వివరాల్లోకి వెళితే 14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై, ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా, సమంత హీరోయిన్ గా, శ్రీనువైట్ల దర్శకత్వంలో, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనీల్ సుంకర సయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం "దూకుడు". ఈ మహేష్ బాబు "దూకుడు" సినిమా షూటింగ్ ముమదుగా టర్కీలో జరిగింది. ఆ తర్వాత రామోజీ ఫిలిం సిటీలో, చార్మినార్ ప్రాంతంలో జరిపి, శేరి లింగంపల్లి సమీపంలోని అల్యూమినియం ఫ్యాక్టరీలో యాక్షన్ సీన్లను చిత్రీకరించారు.

ప్రస్తుతం మహేష్ బాబు "దూకుడు" సినిమా షూటింగ్ చిరాన్ ఫోర్ట్ లో జరుగుతూంది. ఈ మహేష్ బాబు "దూకుడు" సినిమా అనుకున్న షెడ్యూల్ ప్రకారం ఆగస్టులో విడుదల కావలసింది. కాని ఫెడరేషన్ సమ్మె మూలంగా అనుకోకుండా ఆలస్యమైంది. మహేష్ బాబు "దూకుడు" సినిమా ఆడియోని ఆగస్టు నెలలో తొమ్మిదవ తేదీన విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. ఆ రోజు ప్రిన్స్ మహేష్ బాబు జన్మదినం కూడా కావటం విశేషం.

రికార్డుల వేటలో మన శంకర వరప్రసాద్ గారు.. రెండు రోజుల కలెక్షన్స్ ఇవే 

సిల్వర్ స్క్రీన్ పై మనశంకరవరప్రసాద్ గారు(Mana Shankara Varaprasad Garu)వెంకీ గౌడ ల జులుం యధావిధిగా కొనసాగుతుంది. ఎనామనస్ గా అన్ని ఏరియాల ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ వస్తుండటంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కలకలలాడుతున్నాయి. దీంతో హిట్ కోసం ఎదురుచూస్తున్న చిరంజీవికి ఏకంగా బ్లాక్ బస్టర్ హిట్ దక్కినట్లయింది. కలెక్షన్స్ పరంగా కూడా చిరంజీవి కెరీర్ లోనే హయ్యస్ట్ నెంబర్ ని వసూలు చేసే అవకాశం ఉందని సినీ ట్రేడ్ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. మరి ఇప్పటి వరకు  మన శంకర వర ప్రసాద్ రాబట్టిన కలెక్షన్స్ ని చూద్దాం.