English | Telugu

దిల్‌రాజు.. దొరికిపోయాడు

సినీ వేడుక‌ల్లో బోలెడ‌న్ని త‌మాషాలు జ‌రుగుతుంటాయ్‌. ఈ సినిమా గ్యారెంటీ హిట్టు... అస‌లు ఇంత అద్భుత‌మైన సినిమా ఇప్పటి వ‌ర‌కూ రాలేదు, ఇంత క‌థ ఎప్పుడూ చూళ్లేదు అంటూ ఏవేవో మాట్లాడుతుంటారు. తెర‌పై బొమ్మ ప‌డ్డాక‌గానీ, అస‌లు నిజం బోధ‌ప‌డ‌దు. ఆ వేడుక‌కు వ‌చ్చిన అతిథుల విష‌యంలోనూ ఇదే తంతు. ట్రైట‌ర్లు చూస్తుంటే... బాక్సాఫీసుని ఇర‌గ‌దీసే సినిమాలా క‌నిపిస్తోంది, రికార్డులు సృష్టిస్తుంది, గ‌ల్లా పెట్టె నిండిపోవ‌డం ఖాయం అని గొప్ప‌లు పోతుంటారు. కొంత‌మందైతే.... ''ఈ దర్శ‌కుడు తీసిన ఫ‌లానా సినిమా ఎన్నిసార్లు చూశానో లెక్కేలేదు'' అని చెప్తుంటారు. టాలీవుడ్‌లో బ‌డా నిర్మాత‌గా పేరొందిన‌ దిల్‌రాజు కూడా అదే బాప‌తు. ఓ ఆడియో ఫంక్ష‌న్‌కి వెళ్తే... ఇలాంటి డైలాగులే చెప్తారు. స‌రిగ్గా ఇదే సీన్ రిపీట్‌చేస్తూ.. త‌ప్పులో కాలేశాడు దిల్‌రాజు. ''య‌మ‌లీల 2'' పాట‌ల విజ‌యోత్స‌వం కార్య‌క్ర‌మానికి అతిథిగా వెళ్లాడు దిల్‌రాజు. అక్క‌డ ఏదోటి మాట్లాడాలి క‌దా...? అందుకే ''య‌మ‌లీల నాకు భ‌లే బాగా న‌చ్చింది. అందులో చినుకు చినుకు అందెల‌తో.. పాట‌కోసం ఈ సినిమాని ప‌ది సార్లు చూశా..'' అనేశాడు. నిజానికి చినుకు చినుకు అందెల‌తో పాట య‌మ‌లీల‌లో లేదు. అది మాయ‌లోడు సినిమా గీతం. య‌మ‌లీల‌కీ, మాయ‌లోడుకీ తేడా తెలియ‌క‌పోతే ఎట్టా..?? అంటూ స‌భికులంతా న‌వ్వేసుకొన్నారు. దిల్‌రాజు ప‌క్క‌నున్న‌వాళ్లు ఉప్పందిస్తే... మ‌ళ్లీ తేరుకొని... ''అమ్మ పాట కోసం ఈ సినిమా 20 సార్లు చూశా'' అని మాట మార్చేశాడు. మొత్తానికి సిల్లీ సిల్లీగా మాట్లాడి కావ‌ల్సినంత ఎంట‌ర్‌టైన్ చేశాడు దిల్‌రాజు!!

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.