English | Telugu

రాజు గారి కేరింతలు

పెద్ద స్టార్లు లేకుండా కొత్త స్టార్ కాస్టింగ్ తో దిల్ రాజు నిర్మించిన చిత్రం 'కేరింత'. గత వారం రిలీజైన ఈ సినిమాకు మొదట ఊహించిన రెంజులో రివ్యూలు కానీ, టాక్ కానీ రాకపోవడంతో దిల్ రాజు నిరుత్సాహపడ్డారు. ఈ సినిమాకు పెట్టిన డబ్బులు వస్తే చాలు దేవుడా అని అనుకున్నాడట. అయితే 'కేరింత' సినిమా కథలో దమ్ము వుండడంతో బాక్స్ ఆఫీస్ వద్ద అనుహ్యంగా పుంజుకుంది. సాధారణ ప్రేక్షకుడి మౌత్ టాక్ తో బాక్స్ ఆఫీస్ వద్ద ముందుకు దూసుకుపోతుంది. దీంతో దిల్ రాజు ఆనందంతో కేరి౦తలు కొడుతున్నారట.

ఒక్క వైజాగ్ ఏరియాకే కేరింత కోటిన్నర షేర్ సాధించేసిన ఈ సినిమా రెండు రాష్ట్రాల్లో కలెక్షన్లు కలిపితే ఏ రెంజుకి వెళుతుందోనని ఇండస్ట్రీ వర్గాలు ఆసక్తిగా చూస్తున్నాయి. రెండు రాష్ట్రాల్లో దిల్ రాజు స్వంతంగా రిలీజ్ చేసుకున్నారు. అంటే కనీసం అయిందు కోట్ల షేర్ వచ్చే అవకాశం కనిపిస్తోంది. శాటిలైట్ ఇంకా కాలేదు కాబట్టి కనీసం మూడు కోట్లకు లాగేసే అవకాశం వుందట. దాంతో దిల్ రాజు కేరింతలే కేరింతలు.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.