English | Telugu

మీడియా అంటే భ‌య‌ప‌డుతున్న ముద్దుగుమ్మ‌లు

గ్లామ‌ర్ ప్ర‌పంచానికి `మీడియా` కావాలి... `మీడియా`కు గ్లామ‌ర్ ప్ర‌పంచం కావాలి. అందుకే ఈ రెండు రంగాలు ఇచ్చిపుచ్చుకొంటుంటాయి. మ‌రీ ముఖ్యంగా క‌థానాయిక‌లు `మీడియా` ముందు హొయ‌లుపోతుంటారు. ఫొటోగ్రాఫ‌ర్లు, కెమెరామెన్లు చుట్టుముడుతుంటే, పాత్రికేయులు త‌మ ఇంట‌ర్వ్యూల కోసం ప‌రుగులు తీస్తుంటే.. క్రేజ్ అనుకొంటుంటారు. మీడియా త‌మ‌కు దూర‌మ‌వుతుందంటే బెంగ పెట్టుకొంటారు. అలాంటిది కొంత‌మంది క‌థానాయిక‌లు మీడియా అంటే `అమ్మ‌బాబోయ్‌` అంటున్నారు. ఇంట‌ర్వ్యూల‌కు దూర‌మ‌య్యారు. `మ‌మ్మ‌ల్నిఈ ఛాన‌ళ్లు, ప్రెస్సూ క‌వ‌ర్ చేయ‌క‌పోతేనే మేలు` అనుకొంటున్నారు. అలాంటి వారిలో న‌య‌న‌తార‌, హ‌న్సిక‌. త్రిష‌, స‌మంత‌.. ఇలా చాలామందే ఉన్నారు.

పొగిడినంత కాలం క‌థానాయిక‌ల‌కు బాగానే ఉంటుంది. `అదంట క‌దా, ఇదంట క‌దా` అంటూ గాసిప్పులు రాస్తేనే వాళ్ల‌కు బాధొచ్చేస్తుంటుంది. ఇటీవ‌ల స‌మంత - త్రివిక్ర‌మ్ మ‌ధ్య ఏదో జ‌రుగుతోంద‌న్న ప్ర‌చారం ఊపందుకొంది. అవి చూసి స‌మంత తెగ గాభ‌రా ప‌డిపోయింద‌ట‌. `ఉన్న‌వీ లేనివీ ఎందుకు రాస్తారు.? దిస్ ఈజ్ టూ మ‌చ్‌` అంటూ ఆగ్ర‌హం వెల్లుబుచ్చింద‌ట‌. అందుకే ఇక నుంచి మీడియాకు వీలైనంత దూరంగా ఉండాల‌నుకొంటోంద‌ట‌.


ఇక న‌య‌న‌తార ముందు నుంచీ మీడియాకు దూరంగానే ఉంటోంది. ఈమ‌ధ్య అది మ‌రింత ఎక్కువైంది. ఓ త‌మిళ ద‌ర్శ‌కుడితో న‌య‌న ఎఫైర్ న‌డుపుతోంద‌ని, ఇద్ద‌రికీ ర‌హ‌స్యంగా పెళ్ల‌యిపోయింది గుస‌గుస‌లు వినిపించాయి. ఇద్ద‌రూ మ‌రీ టూమ‌చ్ క్లోజ్ గా ఉన్న ఓ సెల్ఫీ బ‌య‌ట‌కు వ‌చ్చింది. దాంతో... లేనిపోని అనుమానాలు మొద‌ల‌య్యాయి. తాను ఎదురైతే మీడియా ఈ విష‌యాల‌పై ఎక్క‌డ గుచ్చి గుచ్చి అడుగుతుందో అని న‌య‌న భ‌య‌ప‌డుతోంది.



హ‌న్సిక మీడియాతో కాస్త ఫ్రెండ్లీగానే ఉండేది. ఇప్పుడు త‌ను కూడా `నో మీడియా` అంటోంది. ఎందుకంటే ఇటీవ‌ల అమ్మ‌డి సెల్పీలు కొన్ని బ‌య‌ట‌ప‌డ్డాయిలెండి. అందులో స‌గం న్యూడ్‌గా క‌నిపించింది. ఆ సెల్పీలు మీవేనా అని అడుగుతార‌ని ఆమె భ‌యం. దాంతో పాటు శింబుతో న‌డుపుతున్న ల‌వ్ ఎఫైర్ గురించీ మాట్లాడాల్సివ‌స్తుంద‌ని కంగారు ప‌డుతోంది. త్రిష కూడా అంతే. వ‌రుణ్తో ఎందుకు విడిపోయిందో చెప్పాల్సివ‌స్తుంద‌ని మీడియాకు వీలైనంత దూరంగా ఉంటోంది.

క‌థానాయిక‌ల అందాల్ని, వాళ్ల విజ‌యాల్ని పొగిడినంత కాలం.. వీళ్లంద‌రికీ మీడియా కావ‌ల్సివ‌చ్చింది. ఎప్పుడైతే.. వ్య‌క్తిగ‌త జీవితాల్లో మీడియా తొంగిచూడడం మొద‌లెట్టిందో వాటికి స‌మాధానాలు చెప్పాల్సివ‌స్తుంద‌ని ఇలా మీడియాకు దూరంగా ఉంటున్నారు. మ‌రి వీళ్లంద‌రికీ ప్ర‌సార‌మాధ్య‌మాల‌పై క‌రుణ ఎప్ప‌టికి క‌లుగుతుందో..?

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.