English | Telugu

ధోని రివ్యూ

కథ - మన సమాజంలో దాదాపు ప్రతి ఇంట్లో ఇలాంటి సంఘటనలు జరిగే అవకాశం ఉంది. అలాంటి నిజజీవితానికి దగ్గరగా ఉందే కథే ఈ "ధోని". భార్య లేని సుబ్రహ్మణ్యం (ప్రకాష్ రాజ్) గవర్నమెంట్ ఆఫీసులో గుమస్తా. అతను తన కొడుకు కార్తీక్, కావేరీలను జాగ్రత్తగా పెంచుకుంటూ ఉంటాడు. స్తోమతు లేకపోయినా పెద్ద స్కూల్లో చదిస్తూంటాడు. కూతురు బాగానే చదువుతుంది కానీ కొడుకే క్రికెట్ ఆట మీద ఉన్న అభిమానంతో చదువు సరిగ్గా చదవడు. కారణం అతనికి ఇండియన్ కేప్టెన్ ధోనీ ప్రేరణ, స్ఫూర్తి. తొమ్మిదవ తరగతి చదువుతున్న కార్తీక్ క్రికెట్ ఆటలో బాగా రాణిస్తుంటాడు. కానీ నూరు శాతం రిజల్ట్స్ ఆశించే అతను చదువుతున్న స్కూల్ యాజమాన్యం అతన్ని స్కూల్ నుంచి పంపెస్తామంటుంది. దాంతో ట్యూషన్ పెట్టి మరీ అతన్ని చదివిస్తూంటాడు సుబ్రహ్మణ్యం. అయినా కార్తీక్ కి చదువబ్బదు. దాంతో కోపం వచ్చిన సుబ్రహ్మణ్యం కొడుకుని కొడతాడు. దాంతో గాయపడ్డ కార్తీక్ కోమాలోకి వెళతాడు. ఆ తర్వాత ఏమయిందనేది ఈ చిత్రం కథ.

విశ్లేషణ - ప్రకాష్ రాజ్ జాతీయ ఉత్తమ నటుడి అవార్దుని సోంతం చేసుకున్న నటుడు. అలాగే ఈ చిత్రంతో దర్శకుడిగా కూడా అతన్ని అవార్డులు వరిస్తాయి. ఈ చిత్రానికి అతనే నిర్మాత కూడా. సినిమాలో తానేం చెప్పదలచుకున్నాడో డొంక తిరుగుడు లేకుండా, ముక్కుకు సూటిగా చెప్పాడు ప్రకాష్ రాజ్. తాను దర్శకుడిగా కూడా తనలోని నటుడికి ఏమాత్రం తీసిపోనని ఈ చిత్రంతో ప్రేక్షకులకు తెలియచెప్పాడాయన. చాలా చక్కని స్క్రీన్ ప్లేతో, ఈ సినిమా తీయటంలో తనదైన ముద్రను వేశాడు ప్రకాష్ రాజ్. ప్రకాష్ రాజ్ దర్శకుడిగా తన రేంజ్ ఏంటో, నిర్మాతగా తన అభిరుచి ఏంటో ఈ సినిమాలో చాలా స్పంష్తంగా చెప్పాడు. చాలా శక్తివంతమైన మాధ్యమమైన సినిమాకి సామాజిక బాధ్యత కూడా ఉందని నమ్మే వ్యక్తిని తానని ప్రకాష్ రాజ్ ఈ "ధోనీ" సినిమా ద్వారా నిరూపించాడు. రియల్లీ హేట్సాఫ్ టు హిమ్. నిర్మాణపు విలువలు బాగున్నాయి.

నటన - ప్రకాష్ రాజ్ అద్భుతమైన నటుడని చెప్పటం అంటే చర్విత చర్వణం అవుతుంది. అంటే చెప్పిన సంగతే పదే పదే చెప్పటం వంటిది. అది ఇప్పటికే అనేక సినిమాల ద్వారా నిరూపించబడింది. ఇక ఈ సినిమాకి వస్తే కొన్ని సందర్భాల్లో అంటే ముఖ్యంగా తన కొడుకు కోమాలోకి వెళ్ళిన సీన్లో కొడుకుతో తన మనసులోని బాధను చేప్పుకునే సీన్లో, టి.వి.లైవ్ షోలో ప్రజలకు తన మనసులోని ఆవేదన చెప్పే సీన్లో ప్రకాష్ లోని నటుడికి అతనిలోని దర్శకుడు తోడై మన మనసులను ఆర్ద్ర పరుస్తాడు. చూసే వారి కళ్ళలో చెమ్మఊరుతుంది. ఇది ఈ చిత్రం చూస్తే మీకర్థమవుతుంది. ఇక రాధిక ఆప్టే, సాయి, మేల్కోటే, తనికెళ్ళ భరణి, హేమ, నాజర్, బ్రహ్మానందం ఇలా మిగిలిన వారంతా తమ తమ పాత్రలకు పరిపూర్ణ న్యాయం చేశారు.

సంగీతం - ఇళయరాజా ఈ సినిమాకి పైసా పారితోషికం కూడా తీసుకోకుండా ఎందుకు పనిచేశారో ఈ సినిమా చూస్తే అర్థమయ్యింది. ఆయన మనసు పెట్టి సంగీతం అందిస్తే ఎలా ఉంటుందో ఈ సినిమా పాటల్లో మనం వినవచ్చు. రీ-రికార్డింగ్ చాలా కొత్తగా, అద్భుతంగా ఉంది.

సినిమాటోగ్రఫీ - గుహన్ కెమెరా వర్క్ గురించి ఈ రోజు కొత్తగా ఏం చెపుతాం. "నాని, అతడు, జల్సా, గగనం, దూకుడు" వంటి చిత్రాల్లో అతని కెమెరా పనితనం మనం ఇప్పటికే చూశాం. చాలా బాగుంది.

మాటలు - సందర్భోచితంగా ఉండి బాగున్నాయి.

పాటలు - సీతారామశాస్త్రిగారు ఈ చిత్రంలోని అన్ని పాటలనూ వ్రాశారు. సాహిత్యపరంగా చిన్నపదాల్లో అద్భుతమైన భావాలని ఆయన పొదిగిన తీరు అద్భుతం.

ఎడిటింగ్ - చాలా బాగుంది.

ఆర్ట్ - ఇదీ అంతే...చాలా బాగుంది.

కొరియోగ్రఫీ - బాగుంది. ముఖ్యంగా ప్రభుదేవా నటించిన పాటలో సింపుల్‍ గా, భావయుక్తంగా ఉండి ఆకట్టుకుంటుంది.

యాక్షన్ - ఈ సినిమాకి అక్కరలేదు...!

మీకు పిల్లలుంటే ఈ చిత్రం కచ్చితంగా చూడాలి. మీరు మనిషైతే, మనసుంటే, మన భావి తరాల గురించి ఆలోచించే వారైతే ఈ సినిమా చూసి తీరాలి...! ఇది రొటీన్ కమర్షియల్ సినిమా కాదు. వెరైటీ కోరుకునే ప్రేక్షకుల కోసం ఒక అద్భుతమైన నటుడు తన కృతజ్ఞత చెప్పుకోటానికి తీసిన చిత్రం...! సకుటుంబంగా ఈ సినిమా చుడవచ్చు.

ఇండియన్ సినిమా హిస్టరీలో ఇలాంటి సినిమా రాలేదు.. మారుతి ఏమంటున్నాడు

రెబల్ సాబ్ ప్రభాస్(Prabhas)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ పై తన కట్ అవుట్ కి ఉన్న క్యాపబిలిటీని రాజాసాబ్(The Raja saab)తో మరోసారి చాటి చెప్పాడు. ఇందుకు సాక్ష్యం రాజాసాబ్ తో తొలి రోజు 112 కోట్ల గ్రాస్ ని రాబట్టడమే.  ఈ మేరకు  మేకర్స్ కూడా ఈ విషయాన్ని అధికారకంగా ప్రకటిస్తూ పోస్టర్ ని కూడా రిలీజ్ చేసారు. దీంతో ప్రభాస్ అభిమానుల ఆనందానికి అయితే అవధులు లేవు. చిత్ర బృందం ఈ రోజు రాజా సాబ్ కి సంబంధించిన విజయోత్సవ వేడుకలు నిర్వహించింది. దర్శకుడు మారుతీ తో పాటు, నిర్మాత విశ్వప్రసాద్(TG Vishwa Prasad)రాజా సాబ్ హీరోయిన్స్ నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హాజరయ్యారు.

రాజాసాబ్ సర్కస్ 1935 .. సీక్వెల్ కథ ఇదేనా! 

పాన్ ఇండియా ప్రభాస్(Prabhas)అభిమానులు,ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రెబల్ మూవీ 'ది రాజాసాబ్'(The Raja saab)నిన్న బెనిఫిట్ షోస్ తో థియేటర్స్ లో ల్యాండ్ అయ్యింది. దీంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కళకళలాడుతున్నాయి. సుదీర్ఘ కాలం తర్వాత సిల్వర్ స్క్రీన్ పై వింటేజ్ ప్రభాస్ కనిపించడంతో ఫ్యాన్స్ ఆనందానికి అయితే అవధులు లేవు. రిజల్ట్ విషయంలో మాత్రం మిక్స్డ్ టాక్ వినపడుతుంది. రివ్యూస్ కూడా అదే స్థాయిలో  వస్తున్నాయి. కాకపోతే తెలుగు సినిమా ఆనవాయితీ ప్రకారం ఈ రోజు సెకండ్ షో కంప్లీట్ అయిన తర్వాత గాని అసలైన టాక్ బయటకి రాదు.