English | Telugu
దేవర బ్రేక్ ఈవెన్ టార్గెట్.. ఎన్టీఆర్ ఊదేస్తాడు...
Updated : Sep 19, 2024
'జనతా గ్యారేజ్' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (NTR), డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న మూవీ 'దేవర' (Devara). సెప్టెంబర్ 27న థియేటర్లలో అడుగుపెట్టనున్న ఈ యాక్షన్ డ్రామాపై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. మాములుగా అయితే, ఆ అంచనాలకు తగ్గట్టుగా భారీ బిజినెస్ చేసి.. అదిరిపోయే ప్రాఫిట్స్ ని ఖాతాలో వేసుకోవాలని నిర్మాతలు భావిస్తారు. కానీ 'దేవర' మేకర్స్ మాత్రం మరీ అత్యాశకు పోకుండా.. రీజనబుల్ థియేట్రికల్ బిజినెస్ చేశారు. అది బయ్యర్ల పాలిట వరంలా మారే అవకాశం కనిపిస్తోంది. (Devara Business)
నైజాంలో రూ.45 కోట్లు, ఆంధ్రాలో రూ.46 కోట్లు, సీడెడ్ లో రూ.22 కోట్లు బిజినెస్ చేసిన దేవర.. తెలుగు రాష్ట్రాల్లో రూ.113 కోట్ల బిజినెస్ చేసినట్లు తెలుస్తోంది. ఇక కర్ణాటకలో రూ.15 కోట్లు, తమిళనాడులో రూ.6 కోట్లు, కేరళలో రూ.50 లక్షలు, నార్త్ ఇండియాలో రూ.15 కోట్లు చేయగా.. ఓవర్సీస్ లో రూ.26 కోట్లు బిజినెస్ చేసిందని సమాచారం. వరల్డ్ వైడ్ గా రూ.175.5 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసింది. పబ్లిసిటీ ఖర్చు కలిపితే.. బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ.180 కోట్ల షేర్ దాకా ఉంటుంది.
భారీ అంచనాలున్న 'దేవర' లాంటి బడా మూవీకి రూ.180 కోట్ల షేర్ టార్గెట్ అనేది.. పెద్ద విషయమేమీ కాదు. ఇప్పటికే ఓవర్సీస్ బుకింగ్స్ ఓపెన్ కాగా.. అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. తెలుగు స్టేట్స్ తో పాటు మిగతా చోట్ల కూడా ఎప్పుడెప్పుడు బుకింగ్స్ ఓపెన్ అవుతాయా అని అందరూ ఆసక్తికగా ఎదురుచూస్తున్నారు. మొదటి రోజే ఈ సినిమా రూ.75 కోట్లకు పైగా షేర్ రాబట్టే అవకాశముంది. టాక్ తో సంబంధం లేకుండా, మొదటి వీకెండ్ లోనే.. రూ.150 కోట్ల షేర్ రాబట్టే ఛాన్స్ ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. సినిమాకి పాజిటివ్ టాక్ వస్తే.. మొదటి వారంలోనే బ్రేక్ ఈవెన్ సాధించి, ప్రాఫిట్స్ లోకి ఎంటరయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. లాంగ్ రన్ లో రూ.250 కోట్లకు తగ్గకుండా షేర్ రాబడుతుంది అనడంలో సందేహం లేదు. ఈ లెక్కన బయ్యర్లు మంచి లాభాలను చూసే ఛాన్స్ ఉంది.