English | Telugu

మోహన్ బాబుతో పాటు ఏడుగురిపై కేసు

"దేనికైనా రెడీ" చిత్రం బ్రహ్మణుల కించ పరిచే విధంగా ఉందని బ్రాహ్మణ సమాజం సేవా సంస్థ సహాయ కార్యదర్శి వారణాసి పవన్ కుమార్ జనగామ కోర్టులో పిటీషన్ వేసిన నేపథ్యంలో కేసు నమోదు చేసి విచారణ జరుపాల్సిందిగా కోర్టు ఆదేశించింది. ఈ చిత్ర నిర్మాత మోహన్ బాబుతో పాటు మరో ఏడుగురిపై వరంగల్ జిల్లా జనగామ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. హీరో మంచు విష్ణు , చిత్ర నిర్మాత మోహన్ బాబు , దర్శకుడు జి. నాగేశ్వరరెడ్డి , సెన్సార్ బోర్డు ఆఫీసర్ ఎ. ధనలక్ష్మి, రచయిత కోన వెంకట్ మరియు వెంకట సుబ్రహ్మణ్యం, బి. రవిలపై కేసులు నమోదయ్యాయి. ఈ మధ్య కాలంలో మోహన్ బాబు కి మంచు విష్ణు కి బ్రాహ్మణ సంఘాలు పిండ ప్రధానం చేసారు. విష్ణు మీడియా తో మాట్లాడుతూ బ్రతికుండగానే తన తండ్రికి పిండ ప్రధానం చేయడాన్ని ఆయన నీచమైన చర్యగా పేర్కొన్నారు. తప్పు చేసిన వారికి శిక్ష పడాల్సిందే అని వెల్లడించారు.

Tags: Denikaina Ready Controversy, Denikaina Ready Movie Controversy, Mohan Babu Controversy, Manchu Vishnu Controversy

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.