English | Telugu

దర్శన్ కి ఉరిశిక్ష విధించండని కోర్టులో వ్యక్తి గొడవ.. కోర్టు రియాక్షన్ ఇదే

రేణుక స్వామి(Renukaswami)ని చంపిన కేసులో ప్రముఖ కన్నడ హీరో 'దర్శన్'(Darshan),హీరోయిన్ 'పవిత్ర గౌడ్'(Pavithra Gowda)కి మంజూరైన బెయిల్ ని ఇటీవల సుప్రీంకోర్ట్ రద్దు చేసిన విషయం తెలిసిందే. దీంతో దర్శన్, పవిత్ర గౌడ లని అరెస్ట్ చేసి బెంగుళూరు(Bengaluru)లోని 'పరప్పన అగ్రహార జైలు'కి తరలించారు. దర్శన్‌ మొదట నుంచి బళ్లారి జైలులో ఉన్నాడు. దీంతో అక్కడి జైలుకి మార్చాలని అధికారులు బెంగళూరులోని 64వ సెషన్స్ కోర్టులో పిటిషన్‌ని దాఖలు చేసారు.

నిన్న ఈ పిటిషన్ విచారణకి వచ్చింది. విచారణ జరుగుతున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తి చేతిలో ఒక పిటిషన్ తో కోర్టు హాలులోకి చొరబడ్డాడు. జడ్జితో పెద్దగా మాట్లాడుతు 'దర్శన్ తో పాటు, ఈ కేసులో సంబంధం ఉన్న ఎవరకి బెయిల్ మంజూరు చేయకండి, దర్శన్‌కి మరణశిక్ష విధించాలని అభ్యర్థించాడు. ఈ ఊహించని పరిణామంతో అక్కడున్న వారంతా అవాక్కయ్యారు. అనంతరం జడ్జి మాట్లాడుతు నువ్వు ఎవరు అని అడిగారు.ఆ వ్యక్తి తన పర్సనల్ విషయాలు చెప్పగానే, ఎవరో సమర్పించిన దరఖాస్తుని అంగీకరించలేను. కేసు ఏదైనా సరే, ఆ వ్యక్తి పిటీషన్‌ కి దరఖాస్తు తీసుకుంటేనే స్వీకరిస్థాను. ఈ కేసుకి సంబంధించిన అన్ని చట్టపరమైన చర్యలు నిబంధనల ప్రకారం జరగాలి. బయటి వ్యక్తుల జోక్యాన్ని అనుమతించబోనని న్యాయమూర్తి స్పష్టం చేశారు. దీంతో సదరు వ్యక్తి కోర్టు గది నుంచి వెళ్లిపోయాడు.

దర్శన్ అభిమాని అయిన రేణుక స్వామి హత్య గత ఏడాది జూన్ 8 న జరిగింది. పవిత్ర గౌడ కి రేణుక స్వామి అసభ్య మెసేజెస్ పంపిస్తున్నాడనే కారణంతో, దర్శన్ మరి కొంత మంది తో కలిసి అత్యంత దారుణంగా చంపాడు. ఈ కేసుకి సంబంధించి మొత్తం పదిహేను మంది నిందితులుగా ఉన్నారు.


రాజాసాబ్ సర్కస్ 1935 .. సీక్వెల్ కథ ఇదేనా! 

పాన్ ఇండియా ప్రభాస్(Prabhas)అభిమానులు,ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రెబల్ మూవీ 'ది రాజాసాబ్'(The Raja saab)నిన్న బెనిఫిట్ షోస్ తో థియేటర్స్ లో ల్యాండ్ అయ్యింది. దీంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కళకళలాడుతున్నాయి. సుదీర్ఘ కాలం తర్వాత సిల్వర్ స్క్రీన్ పై వింటేజ్ ప్రభాస్ కనిపించడంతో ఫ్యాన్స్ ఆనందానికి అయితే అవధులు లేవు. రిజల్ట్ విషయంలో మాత్రం మిక్స్డ్ టాక్ వినపడుతుంది. రివ్యూస్ కూడా అదే స్థాయిలో  వస్తున్నాయి. కాకపోతే తెలుగు సినిమా ఆనవాయితీ ప్రకారం ఈ రోజు సెకండ్ షో కంప్లీట్ అయిన తర్వాత గాని అసలైన టాక్ బయటకి రాదు.