English | Telugu
షాకింగ్ న్యూస్.. రాకేష్ మాస్టర్ మృతి!
Updated : Jun 18, 2023
టాలీవుడ్ లో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ కన్నుమూశారు. ఇటీవల విశాఖ నుంచి హైదరాబాద్ కి వస్తుండగా తీవ్ర అస్వస్థకు గురి కావడంతో ఆయనను ఆస్పత్రికి తరలించారు. గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన ఈరోజు సాయంత్రం తుదిశ్వాస విడిచారు. ఆయనకు తీవ్ర అనారోగ్య సమస్యలు ఉన్నాయని తెలుస్తోంది.
1968 సంవత్సరంలో తిరుపతి జన్మించిన రాకేష్ మాస్టర్ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు చూశారు. ఎన్నో సినిమాలకు కొరియోగ్రఫీ చేసి స్టార్ కొరియోగ్రాఫర్ గా ఎదిగిన ఆయన తన ముక్కుసూటి తనం కారణంగా పలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రస్తుతం టాప్ కొరియోగ్రాఫర్స్ గా ఉన్న శేఖర్ మాస్టర్, జానీ వంటి వారు ఒకప్పుడు రాకేష్ మాస్టర్ శిష్యులే. కొరియోగ్రాఫర్ గా ఒక వెలుగు వెలిగిన ఆయన చాలాకాలం కనుమరుగైపోయారు. ఆ తర్వాత యూట్యూబర్ గా మారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారారు. పలువురు సెలబ్రిటీల మీద ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. అదే సమయంలో ఆయన తన మాటలతో పలువురు అభిమానులను సంపాదించుకున్నారు.