English | Telugu

వైరల్ అవుతున్న చిరంజీవి కొత్త పిక్ 

సినిమా రంగంలో ఎంత టాప్ హీరోగా పేరు సంపాదించినా కొన్ని సంవత్సరాల వరకే ఆ హీరో స్టార్ గా రాణించి అశేష అభిమానులని సంపాదించుకొని తమ నటన తో అలరిస్తూ ఉంటారు. ఇంకా చెప్పలంటే ఆ స్టార్ జర్నీ మహా అయితే 15 సంవత్సరాలు లేదా 20 సంవత్సరాల వరకు ఉంటుంది. కానీ చిరంజీవి అనే నటుడు ముప్పై సంవత్సరాల నుంచి తెలుగు సినీ పరిశ్రమలో తన జర్నీని కొనసాగించడమే కాకుండా మెగాస్టార్ గా నెంబర్ వన్ పొజిషన్ లో కొనసాగుతు లక్షలాది మంది అభిమానులని తన నటనతో అలరిస్తూ వస్తున్నాడు. ప్రస్తుతం ఆయన న్యూ పిక్ ఒకటి సోషల్ మీడియాని షేక్ చేస్తుంది.

రామాయణాలు ,మహాభారతాలు గురించి అందరికి తెలిసినట్టే మెగాస్టార్ చిరంజీవి అనే వ్యక్తి సినిమా ఇండస్ట్రీ లో సాధించిన రికార్డు లు గురించి అందరికి తెలుసు. లేటెస్ట్ గా భోళాశంకర్ మూవీ తో తన యాక్టింగ్ లో పవర్ తగ్గలేదని నిరూపించాడు. కానీ ఆ సినిమా పాత కథ ,కధనాలు పాత టేకింగ్ వలన పరాజయం పాలయ్యింది. అలాగే ఆ సినిమా ప్లాప్ చిరంజీవికి ఇంకో సరికొత్త పాఠాన్ని కూడా నేర్పింది. చిరంజీవి నుంచి అలాంటి సినిమాలు కాదు మేము కోరుకుంటుంది ఆయన రేంజ్ కి తగ్గ సినిమా కావాలని ఫాన్స్ ,ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారనే విషయం చిరంజీవికి అర్ధం అయ్యింది ఇప్పుడు ఫాన్స్ అందరి కోరికని తీర్చడం కోసం బింబి సారా మూవీ డైరెక్టర్ వశిష్ట తో చిరంజీవి మూవీ చేస్తున్నాడు.అఫీషియల్ గా కూడా అనౌన్సుమెంట్ కూడా వచ్చిన ఈ సినిమా చిరంజీవి సూపర్ బ్లాక్ బస్టర్ మూవీ జగదేకవీరుడు అతిలోక సుందరి మూవీలా సోషియో ఫాంటసి జోనర్ లో సాగుతుందని తెలుస్తుంది.ఇంక అసలు విషయానికి వస్తే...ఇప్పుడు సోషల్ మీడియా లో షేక్ చేస్తున్న చిరు నయా పిక్ మూవీ చిరు కొత్త మూవీ షూటింగ్ కి సంబంధించి చిరు ప్రిపేర్ అవుతున్న స్టిల్ అని అంటున్నారు .అలాగే చిరు పిక్ ని చూసిన అభిమానులు చిరంజీవి వయసులో ఇంకో 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళినట్టే అని అంటున్నారు.

కాగా చిరంజీవి నయా లుక్ కి సంబంచిన ఫోటో ఎలా బయటికి వచ్చిందనుకున్న అభిమానులుకి చిరు ఫోటో చూసిన తర్వాత విషయం అర్ధం అయ్యింది .ప్రఖ్యాత సినీ రచయిత సత్యానంద్ తెలుగు సినీ పరిశ్రమలో కి వచ్చి 50 ఏళ్ళు పూర్తిచేసుకున్న సందర్భంగా చిరంజీవి ని కలవడం జరిగింది. ఈ సందర్భంగా చిరు పిక్ బయటకి వచ్చింది. చిరంజీవి,సత్యానంద్ కాంబినేషన్ లో ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలు వచ్చాయి.అలాగే చిరంజీవి మెగాస్టార్ అవ్వడం వెనుక సత్యానంద్ ఉన్నారు. ఇద్దరు కలిసి ఉన్న ఫోటోని కూడా చూడవచ్చు.

ఇండియన్ సినిమా హిస్టరీలో ఇలాంటి సినిమా రాలేదు.. మారుతి ఏమంటున్నాడు

రెబల్ సాబ్ ప్రభాస్(Prabhas)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ పై తన కట్ అవుట్ కి ఉన్న క్యాపబిలిటీని రాజాసాబ్(The Raja saab)తో మరోసారి చాటి చెప్పాడు. ఇందుకు సాక్ష్యం రాజాసాబ్ తో తొలి రోజు 112 కోట్ల గ్రాస్ ని రాబట్టడమే.  ఈ మేరకు  మేకర్స్ కూడా ఈ విషయాన్ని అధికారకంగా ప్రకటిస్తూ పోస్టర్ ని కూడా రిలీజ్ చేసారు. దీంతో ప్రభాస్ అభిమానుల ఆనందానికి అయితే అవధులు లేవు. చిత్ర బృందం ఈ రోజు రాజా సాబ్ కి సంబంధించిన విజయోత్సవ వేడుకలు నిర్వహించింది. దర్శకుడు మారుతీ తో పాటు, నిర్మాత విశ్వప్రసాద్(TG Vishwa Prasad)రాజా సాబ్ హీరోయిన్స్ నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హాజరయ్యారు.

రాజాసాబ్ సర్కస్ 1935 .. సీక్వెల్ కథ ఇదేనా! 

పాన్ ఇండియా ప్రభాస్(Prabhas)అభిమానులు,ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రెబల్ మూవీ 'ది రాజాసాబ్'(The Raja saab)నిన్న బెనిఫిట్ షోస్ తో థియేటర్స్ లో ల్యాండ్ అయ్యింది. దీంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కళకళలాడుతున్నాయి. సుదీర్ఘ కాలం తర్వాత సిల్వర్ స్క్రీన్ పై వింటేజ్ ప్రభాస్ కనిపించడంతో ఫ్యాన్స్ ఆనందానికి అయితే అవధులు లేవు. రిజల్ట్ విషయంలో మాత్రం మిక్స్డ్ టాక్ వినపడుతుంది. రివ్యూస్ కూడా అదే స్థాయిలో  వస్తున్నాయి. కాకపోతే తెలుగు సినిమా ఆనవాయితీ ప్రకారం ఈ రోజు సెకండ్ షో కంప్లీట్ అయిన తర్వాత గాని అసలైన టాక్ బయటకి రాదు.