English | Telugu
చిరంజీవి ట్వీట్ ప్రధాని మోదీ కోసమే..ఇక నెంబర్ వన్ అవ్వడమే లక్ష్యం
Updated : Feb 8, 2025
మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi)రీసెంట్ గా జూమ్ కాల్ లో మన దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ(Narendra Modi)నిర్వహించిన,వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్‌టైన్‌మెంట్ సమ్మిట్ (Waves ) లో పాల్గొనడం జరిగింది.
ఇప్పుడు ఈ విషయంపై చిరంజీవి ఎక్స్ వేదికగా ట్వీట్ చేస్తు గౌరవనీయులైన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి ధన్యవాదాలు,వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్‌టైన్‌మెంట్ సమ్మిట్(Waves )కోసం అడ్వైజరీ బోర్డ్‌లో భాగం కావడం మరియు ఇతర గౌరవనీయ సభ్యులతో కలిసి నా సూచనలు పంచుకోవడం నిజంగా ఒక విశేషం.మీ మెదడు నుంచి పుట్టిన,WAVES భారతదేశాన్ని ముందుకు నడిపిస్తాయనడంలో నాకు ఎటువంటి సందేహం లేదు.సాఫ్ట్ పవర్ గా ప్రపంచంలోనే అతి త్వరలోనే సరికొత్త పుంతలు తొక్కుతు అత్యంత ఎత్తుకి ఎదుగుతుందని తెలిపాడు.
ఇక వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్‌టైన్‌మెంట్ సమ్మిట్ (WAVES)అనేది మీడియా మరియు ఎంటర్‌టైన్‌మెంట్ ఇండస్ట్రీకి సంబంధించిన గ్లోబల్ సమ్మిట్.ముఖ్యంగా ఇది భారతీయ మీడియా మరియు ఎంటర్‌టైన్‌మెంట్ ఇండస్ట్రీపై దృష్టి సారిస్తుంది. ప్రకటనలు,గేమింగ్,కంటెంట్ ఉత్పత్తి, యానిమేషన్ మరియు సంగీతంలో అవకాశాలను ఉపయోగించుకోవడానికి ఒక వేదికను కూడా అందిస్తుంది.కంటెంట్ సృష్టి,ఫైనాన్సింగ్‌లో వ్యూహాత్మక సహకారాలు,ప్రతిభ అంతరాలను పరిష్కరించడం, స్థానికీకరణ మరియు విలువైన IPలను సృష్టించి,పెట్టుబడులను ఆకర్షించడం,భారతదేశాన్ని ఒక ఆవిష్కరణ కేంద్రంగా,వినోదంలో ప్రపంచ అగ్రగామిగా నిలబెట్టడమే Waves ప్రధాన లక్ష్యం.రజనీకాంత్,అమితాబచ్చన్,అమీర్ ఖాన్,ఏఆర్ రెహ్మాన్, వంటి సినీ ప్రముఖులతో పాటు వివిధ రంగాలకి చెందిన ప్రతినిధులు కూడా ఇందులో పాల్గొన్నారు.