English | Telugu

మా కుటుంబమంతా ఒక్కటే - మెగాస్టార్

"మా కుటుంబమంతా ఒక్కటే" అని మెగాస్టార్ చిరమజీవి అన్నారు. వివరాల్లోకి వెళితే మెగా ఫ్యామిలీలో కలతలు ఏర్పడ్డాయనీ, చిరంజీవీ, నాగబాబు, పవన్ కళ్యాణ్ ఈ ముగ్గురు అన్నదమ్ముల మధ్య సయోధ్య కరువయ్యిందనీ ఈ మధ్య మీడియాలో కథనాలు రావటంతో చిరంజీవి మనస్తాపం చెంది " మా కుటుంబం అమతా ఒక్కటిగా ఉంది. మేమంతా ఎటువంటి కలహాలూ లేకుండా ఒక్కటిగానే ఉన్నా"మని వివరణ ఇచ్చారు. ఈ గొడవకు కారణం అల్లు అరవింద్ అని ప్రేక్షకులకు వేరే చెప్పక్కరలేదు కదా.

ఆ మధ్య చిరంజీవి ప్రజారాజ్యం అనే రాజకీయ పార్టీ పెట్టటానికీ, ఎన్నికల్లో యమ్ యల్ ఎ టిక్కెట్లు అమ్ముకున్నారన్న అప్రదిష్టతో ఎన్నికల్లో ఆ పార్టీ ఘోరపరాజయాన్ని చవిచూడటానికీ, ఇటీవల ఆ పార్టీని కంగ్రెస్ లో విలీనం చెయ్యటానికీ ముఖ్య కారకుడు అల్లు అరవిందే అనటంలో ఎలాంటి సందేహం అక్కరలేదు. ఇది బహిరంగ రహస్యం. ప్రజారాజ్యం పార్టీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్ చిరంజీవికి చాలా దూరమయ్యాడు. నాగబాబు మాత్రం అంటీ ముట్టనట్టు ఉంటున్నాడు.

 

ఇంకా చెప్పాలంటే ఇటీవల నాగబాబు ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ హీరోగా, త్రిష హీరోయిన్ గా, గణేష్ నిర్మించిన "తీన్ మార్" చిత్రం విషయంలో కూడా అల్లు అరవింద్ ప్రమేయం లేకుండా నాగబాబు జాగ్రత్తలు తీసుకోవటంతో మేగా బ్రదర్స్ మధ్య తేడాలొచ్చాయన్న అనుమానం మీడియాకి రావటం సహజం. ఎందుకంటే మెగా ఫ్యామిలీలో ఏ సినిమా అయినా అల్లు అరవింద్ ప్రమేయం లేకుండా, గీతా ఆర్ట్స్ ప్రమేయం లేకుండా బయటకు రాదు. ఇలాంటి అనేక కారణాలున్నాయి గనకనే  చిరంజీవి మాలో తేడాలు లేవు, మేమంతా ఒక్కటేనని బయటకు చెప్పుకోవాల్సి వచ్చింది.