English | Telugu

ఛార్మి గురించిన మూడు సీక్రెట్స్ ఇవే!

ఎప్పుడు న‌వ్వుతూ, న‌వ్విస్తే హుషారుగా ఉంటుంది ఛార్మి. త‌న కెరీర్‌లో ఎత్తుప‌ల్లాలు మ‌న‌కు తెలిసిన విష‌యాలే! దేవిశ్రీ ప్ర‌సాద్ తో ల‌వ్ ఎఫైర్ న‌డిచింద‌న్న టాక్ కూడా వినిపించింది. అయితే అంత‌కు మించిన ర‌హ‌స్యాలేం ఛార్మి ద‌గ్గ‌ర లేవు! కానీ వాటికి మించిన త‌న ప‌ర్స‌న‌ల్ సీక్రెట్స్‌ని మీడియా సాక్షిగా బ‌య‌ట‌పెట్టింది ఛార్మి. 'మీ గురించి మాకు తెలియ‌ని విష‌యాలు మూడింటి గురించి చెప్పండి' అని అడిగితే.. ఏం చెప్పిందో తెలుసా??

ఛార్మికి చీక‌టింటే భ‌య‌మ‌ట‌. స‌డ‌న్‌గా చీక‌టి క‌మ్ముకొస్తే... ఊరిపిఆగిపోయేంత భ‌య‌ప‌డిపోతుంద‌ట‌. అయితే ప‌డుకొనే ముందు మాత్రం బెడ్ రూమ్‌లో చిన్న లైట్ కూడా వేసుకోద‌ట‌. ఏమాత్రం వెలుగున్నా త‌న‌కు నిద్ర‌ప‌ట్ట‌దంటుంది. ఇక రెండో ర‌హ‌స్యం ఛార్మి ఎలాంటి నిర్ణ‌య‌మైనా చాలా ఫాస్ట్ ఫాస్ట్ గా తీసేసుకొంటుంద‌ట‌. ఎప్పుడు ఏం అనిపిస్తే అప్పుడు అది చేస్తుంద‌ట‌.స‌డ‌న్‌గా ఇల్లు వ‌దిలేసి ఎక్క‌డికో వెళ్లిపోతుంద‌ట‌. ఆ విష‌యం చివ‌రి నిమిషాల వ‌ర‌కూ ఇంట్లోనూ చెప్ప‌ద‌ట‌.

ఇక మూడో ర‌హ‌స్యం.. ఛార్మి ఫుడ్ హాబిట్స్‌. నెల‌ల త‌ర‌బ‌డి డైటింగ్ చేస్తూ, స్లిమ్ అవుతుంద‌ట ఛార్మి. అయితే స‌డ‌న్‌గా ఆహారంపై అభిమానం త‌న్నుకొస్తుంద‌ట‌. అందుకే డైటింగ్ మానేసి ఏది ప‌డితే అది తినేస్తుంద‌ట‌. ఆ స‌మ‌యంలో త‌న‌ని ఎవ‌రూ కంట్రోల్ చేయ‌లేర‌ట‌. మ‌ళ్లీ కావ‌ల్సినంత తిని.. రెండు నెల‌లు మ‌ళ్లీ డైటింగ్ మొద‌లెడుతుంట‌. ఇవీ.. ఛార్మికి సంబంధించిన ఫ్రెష్ సీక్రెట్స్‌.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.