English | Telugu
13న అమృతం పాటలు
Updated : Apr 10, 2014
శ్రీనివాస్ అవసరాల, వాసు, హరుష్, ధన్య ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం "చందమామలో అమృతం". గుణ్ణం గంగరాజు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి శ్రీ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్ర ఆడియోను హైదరాబాదులో ఏప్రిల్ 13న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి ముఖ్య అతిధిగా రానున్నారని తెలిసింది. ఈ చిత్రాన్ని మే నెలలో విడుదల చేయనున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.