English | Telugu

బాలయ్య వర్సెస్ బోయపాటి.. ఎవరిది పైచేయి?

టాలీవుడ్ లో ఉన్న క్రేజీ కాంబినేషన్స్ లో నటసింహం నందమూరి బాలకృష్ణ, డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబో ఒకటి. ఇప్పటిదాకా వీరి కలయికలో మూడు సినిమాలు రాగా, మూడూ బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. నాలుగోసారి చేతులు కలపడానికి కూడా ఈ ఇద్దరూ సిద్ధంగా ఉన్నారు. ఇదిలా ఉంటే ఇప్పటిదాకా కలిసి పనిచేసి హ్యాట్రిక్ కొట్టిన ఈ ద్వయం.. త్వరలో నువ్వా నేనా అన్నట్లుగా బాక్సాఫీస్ బరిలోకి దిగనుండటం ఆసక్తికరంగా మారింది.

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోంది. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని దసరా కానుకగా అక్టోబర్ 20న విడుదల చేయబోతున్నట్లు తాజాగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అయితే ఈ ఏడాది దసరాకు బాలకృష్ణ నటిస్తున్న కొత్త చిత్రం కూడా విడుదలయ్యే అవకాశాలున్నాయి. బాలకృష్ణ ప్రధానపాత్రలో అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా 'NBK 108'(వర్కింగ్ టైటిల్). షైన్ స్క్రీన్స్ బ్యానర్ లో రూపొందుతోన్న ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్, శ్రీలీల ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని దసరాకు విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

తెలుగు సినిమాలకు సంక్రాంతి, దసరా పండుగలు పెద్ద సీజన్లు. ఆ సమయంలో రెండు, మూడు పెద్ద సినిమాలు విడుదలైనా ప్రేక్షకుల ఆదరణ పొందుతాయి. మరి ఈ దసరా బరిలో దిగుతున్న రామ్-బోయపాటి, 'NBK 108' చిత్రాలలో ఏది పైచేయి సాధిస్తుందో చూడాలి.

సినిమాకి ఉన్న శక్తిని మరోసారి చాటి చెప్పావు.. వాళ్ళు భయపడుతున్నారంట! 

కళ.. పేరుగా చూసుకుంటే నామ్ చోటా.. కానీ పంచ భూతాలకి ఎంత శక్తీ ఉందో 'కళ' కి అంతే శక్తీ ఉంది. ఈ కళ నుంచి సినిమా(cinema)రూపంలో వచ్చే మాట, పాట, నటన, నటుడు, దృశ్యం అనేవి మనిషి నరనరనరాల్లో చాలా భద్రంగా ఉండిపోతాయి. ఆ ఐదింటి ద్వారా తమకి బాగా దగ్గరయ్యే  నటుడ్ని అయితే సూపర్ హీరోగా  చేసి తమ గుండెల్లో దైవశక్తిగా భద్రంగా కొలుచుకుంటూ ఉంటారు. ఇళయ దళపతి విజయ్ అప్ కమింగ్ మూవీ జననాయగన్(Jana Nayagan)రేపు ప్రీమియర్స్ నుంచే అడుగుపెడుతుండటంతో సినిమా గొప్ప తనం గురించి మరో సారి సోషల్ మీడియా వేదికగా చర్చ జరుగుతుంది. మరి ఆ చర్చల వెనక ఉన్న పూర్తి విషయం ఏంటో చూద్దాం.