English | Telugu

వీరభద్రంకు "భాయ్" మరో ఆఫర్

నాగార్జునతో "భాయ్" చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న దర్శకుడు వీరభద్రంకు ఈ మధ్య లక్కు బాగానే కలిసొస్తున్నట్లుంది. ప్రస్తుతం "భాయ్" చిత్రంతో బిజీగా ఉన్న వీరభద్రంకు నాగార్జున మరో సినిమాకు కూడా అవకాశం ఇచ్చాడంట. అది కూడా తన కొడుకు నాగచైతన్య సినిమాకు.

నిజానికి నాగార్జున "భాయ్" చిత్రానికి వస్తున్న పాజిటివ్ టాక్ వల్లనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఈ చిత్రానికి సంబంధించిన సాటిలైట్ హక్కులు భారీ మొత్తానికి అమ్ముడు పోవడంతో నిర్మాతలంతా వీరభద్రంతో సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నారంట. అందుకే ముందు జాగ్రత్త కోసమని నాగచైతన్యతో ఓ సినిమా చేయమని నాగార్జున వీరభద్రంకు చెప్పడం, దానికి వీరభద్రం ఒప్పుకొని కథ కూడా తయారుచేసే పనిలో ఉన్నట్లు తెలిసింది.

అయితే ప్రస్తుతం వీరభద్రం "భాయ్" చిత్రం షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. త్వరలోనే ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.