English | Telugu

బండ్ల‌ గ‌ణేష్ కి వార్నింగ్ ఇచ్చిన ఎన్టీఆర్‌??

టెంప‌ర్ ఇచ్చిన విజ‌యానందంలో ఉన్నాడు... బండ్ల గ‌ణేష్‌. ఈసినిమాతో చావో రేవో అనుకొంటున్న స‌మ‌యంలో భారీ ఓపెనింగ్స్‌.... గ‌ణేష్‌కి ఊర‌ట క‌లిగించాయి. అదే ఉత్సాహంలో ఓ వెబ్ సైట్‌కి ఇంట‌ర్వ్యూ ఇచ్చి ఏదేదో మాట్లాడేశాడు. ఈ సినిమా మ‌ధ్య‌లోనే ఆగిపోయేద‌ని, త‌న‌ని మెగా క్యాంప్ వ్య‌క్తి అనుకొన్నార‌ని, పూరి, ఎన్టీఆర్‌తో త‌న‌కు క‌మ్యునికేష‌న్ గ్యాప్ వ‌చ్చింద‌ని, చివ‌ర‌కు అన్నీ స‌ర్దుకొన్నాయ‌ని చెప్పాడు. అంతే కాదు... పీవీపీ చెప్పిన 18 క‌రెక్ష‌న్ల‌తో పూరి ఈ సినిమాని ట్రిమ్ చేశాడ‌ని.. కొన్ని సీక్రెట్స్ బ‌య‌ట‌పెట్టేశాడు. ఆ ఇంట్వ‌ర్యూ కొంత‌మంది నంద‌మూరి అభిమానుల‌కు ఆగ్రహం తెప్పించింది. సినిమా ఇమేజ్‌ని దెబ్బ‌తీసేలా మాట్లాడాడ‌ని ఫైర్ అయ్యారు. ఈ విష‌యం ఎన్టీఆర్‌కీ తెలిసింది. దాంతో ఆయనా... గ‌ణేష్ ని క్లాస్ పీకార‌ని స‌మాచారం. సినిమా రన్నింగ్‌లో ఉన్న‌ప్పుడు ఏది ప‌డితే అది మాట్లాడొద్ద‌ని వార్నింగ్ ఇచ్చాడ‌ట‌. దాంతో గ‌ణేష్ ఆత్మ‌ర‌క్ష‌ణ‌లో ప‌డ్డాడు. ''నేనింత వ‌ర‌కూ ఏ బెబ్ సైట్‌కీ ఇంట‌ర్వ్యూ ఇవ్వ‌లేదు. అవ‌న్నీ న‌మ్మొద్దు'' అని ట్వీట్ చేశాడు. ఇంట‌ర్వ్యూ అంతా బోగ‌స్ అని న‌మ్మించే ప్ర‌య‌త్నం చేశాడు. ఈ సంఘ‌ట‌న‌తో మ‌రోసారి బండ్ల గ‌ణేష్ - ఎన్టీఆర్ ల‌మ‌ధ్య క‌మ్యునికేష‌న్ గ్యాప్ ఏర్ప‌డే ప్ర‌మాదం వ‌చ్చింది. గ‌ణేష్ వాగేయ‌డం ఎందుకు.. ఆ త‌ర‌వాత ఇలా ఇబ్బందుల్లో ప‌డ‌డం ఎందుకు...???

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.