English | Telugu

బి.గోపాల్, నందమూరి బాలకృష్ణల నందీశ్వరుడు

బి.గోపాల్ దర్శకత్వంలో, యువరత్న నందమూరి బాలకృష్ణ హీరోగా "నందీశ్వరుడు" అనే సినిమా తీయటానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం. వివరాల్లోకి వెళితే గతంలో నందమూరి బాలకృష్ణ హీరోగా, బి.గోపాల్ దర్శకత్వంలో "లారీ డ్రైవర్, రౌడీ ఇనస్పెక్టర్, సమరసింహా రెడ్డి, నరసింహ నాయుడు" వంటి అనేక బ్లాక్ బస్టర్ హిట్లు వచ్చాయి. మళ్ళీ బి.గోపాల్, నందమూరి బాలకృష్ణల కాంబినేషన్ లో సినిమా అనేటప్పటికి ఆ మూవీ మీద అంచనాలు ఆకాశమే హద్దుగా ఉంటాయి.

అందుకనే అలాంటి ఒక శక్తివంతమైన కథ కోసం బి.గోపాల్ ఎదురుచూస్తున్న సమయంలో ప్రముఖ సినీ రచయిత చిన్నికృష్ణ "నందీశ్వరుడు" అనే కథ చెప్పినట్లు, ఆ కథకు నందమూరి బాలకృష్ణ కూడా తన అంగీకారం తెలిపినట్లు తెలిసింది. ఈ "నందీశ్వరుడు" కథ పూర్తయితే మనం బి.గోపాల్ దర్శకత్వంలో, నందమూరి బాలకృష్ణ హీరోగా మరో బ్లాక్ బస్టర్ హిట్ ను చూడవచ్చు.

ఇండియన్ సినిమా హిస్టరీలో ఇలాంటి సినిమా రాలేదు.. మారుతి ఏమంటున్నాడు

రెబల్ సాబ్ ప్రభాస్(Prabhas)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ పై తన కట్ అవుట్ కి ఉన్న క్యాపబిలిటీని రాజాసాబ్(The Raja saab)తో మరోసారి చాటి చెప్పాడు. ఇందుకు సాక్ష్యం రాజాసాబ్ తో తొలి రోజు 112 కోట్ల గ్రాస్ ని రాబట్టడమే.  ఈ మేరకు  మేకర్స్ కూడా ఈ విషయాన్ని అధికారకంగా ప్రకటిస్తూ పోస్టర్ ని కూడా రిలీజ్ చేసారు. దీంతో ప్రభాస్ అభిమానుల ఆనందానికి అయితే అవధులు లేవు. చిత్ర బృందం ఈ రోజు రాజా సాబ్ కి సంబంధించిన విజయోత్సవ వేడుకలు నిర్వహించింది. దర్శకుడు మారుతీ తో పాటు, నిర్మాత విశ్వప్రసాద్(TG Vishwa Prasad)రాజా సాబ్ హీరోయిన్స్ నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హాజరయ్యారు.