English | Telugu

ప్రీ రిలీజ్ ఈవెంట్ లో వెనక నుంచోమని చెప్పడం బాధ కలిగించింది

'పెళ్లి'(Pelli)మూవీలో అద్భుతమైన నటనతో పాటు 'రుక్కు రుక్కుమణి సాంగ్' తో ఓవర్ నైట్ స్టార్ నటుడుగా గుర్తింపు పొందారు పృథ్వీ(Babloo Prithiveeraj). ఆ తర్వాత చేసిన పెళ్లిపందిరి, సమరసింహారెడ్డి, నువ్వు నాకు నచ్చావ్, దేవుళ్ళు, ప్రేయసిరావే' వంటి చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకుల అభిమాన నటుడుగా మారాడు. సెకండ్ ఇన్నింగ్స్ లో పాన్ ఇండియా హిట్ గా నిలిచిన 'యానిమల్' లో విలన్ గా మెప్పించిన పృథ్వీ రీసెంట్ గా నందమూరి కళ్యాణ్ రామ్, విజయశాంతి ల అర్జున్ సన్ ఆఫ్ వైజయంతిలో కీలక పాత్రలో కనిపించాడు.

తాజాగా ఒక పాడ్ కాస్ట్ ప్రోగ్రాంలో పాల్గొన్న పృథ్వీ మాట్లాడుతు 2024 లో రిలీజైన 'ఉత్సవం'(Utsavam)మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి వేరే సినిమాల షూటింగ్స్ నుంచి పర్మిషన్ తీసుకొని మరి వెళ్ళాను. ఆ ఫంక్షన్ లో దర్శక నిర్మాతలని పలకరిస్తే పట్టించుకోకపోయే సరికి బిజీగా ఉన్నారేమో అనుకున్నాను. స్టేజ్ ముందు వరుసలో కూర్చొని ఉంటే వేరే వాళ్ళు వచ్చిన ప్రతి సారి పక్కకి జరగమన్నారు. అలా జరుగుతు జరుగుతు అదే వరుసలో చివరికి వెళ్ళిపోయాను. స్టేజ్ పైకి నటినటులతో పాటు నా పక్కనే కూర్చున్న సాంగ్ రైటర్, మేకప్ ఆర్టిస్ట్ ని పిలిచారు. కానీ నన్ను పిలవలేదు. చివరకి గ్రూప్ ఫోటో కోసం స్టేజ్ పైకి రమ్మంటే వెళ్ళాను. అక్కడ అనిల్ రావిపూడితో మాట్లాడుతుంటే ఆయన్ని పక్కకి తీసుకెళ్లిపోయారు.

ఆ తర్వాత గ్రూప్ ఫొటోలో వెనక్కి వెళ్లి నుంచోమంటే వెనక్కి వెళ్ళాను. నా పక్కనే గిరిబాబు గారు రాగానే ఆయన్ని ముందుకు తీసుకెళ్లి నుంచో బెట్టారు. యానిమల్ తో పెద్ద స్టార్ అయిపోయానని అనుకున్నాను కానీ ఎవరు పట్టించుకోకపోయే సరికి ఎంతగానో బాధపడ్డానని చెప్పుకొచ్చాడు. 1975 లో ఏంజి రామచంద్రన్ హీరోగా తెరకెక్కిన 'నాళై నమ్మదే' చిత్రం ద్వారా బాలనటుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన పృథ్వీ ఇప్పటి వరకు తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ భాషల్లోవంద సినిమాల దాకా చేసాడు. పలు సీరియల్స్ లో కూడా నటించాడు

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.

ఓటిటి లో శంబాల రెస్పాన్స్ ఇదే.. ఇది అసలు రికార్డునే కాదు

 కొన్ని చిత్రాలు అంతే.. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి థియేటర్స్ దగ్గర జాతర వాతావరణాన్ని తీసుకొస్తాయి. అలాంటి వాతావరణాన్ని శంబాల(Shambala)తీసుకొచ్చింది. పైగా చిన్న చిత్రాలకి సరికొత్త ఊపిరిని తీసుకొచ్చి ఆది సాయికుమార్ కెరీర్ కే కాదు, తెలుగు చిత్ర పరిశ్రమకే సరికొత్త సినీ యవ్వనాన్ని తీసుకొచ్చింది. భారీ వసూళ్లని అవలీలగా సాధించిన శంబాల జనవరి 22 నుంచి ఆహా(Aha) వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే  . థియేటర్స్ లో లాగానే ఓటిటి వేదికగా సరికొత్త రికార్డ్స్ ని సెట్స్ చేస్తూ అందరు తనవైపు చూసేలా చేస్తుంది. మరి మనం కూడా సదరు రికార్డ్స్ పై లుక్ వేద్దాం