English | Telugu

ఫస్ట్ డే కలెక్షన్స్ లో ఎవరు విన్నర్ 

- బాహుబలి ఎపిక్ vs మాస్ జాతర
- ప్రభాస్, రాజమౌళి, రానా షో స్టార్ట్
- మాస్ జాతర పై భారీ అంచనాలు
- రవి తేజ ఫాన్స్ హంగామ

శుక్రవారం అంటేనే సినిమా.. సినిమా అంటేనే శుక్రవారం. బాక్స్ ఆఫీస్ వద్ద ఆ రోజు రిలీజ్ అయ్యే చిత్రాల మధ్య జరిగే పోటీ ఎంతో రసవత్తరంగా ఉంటుంది. ఒక వేళ అగ్ర హీరోలకి సంబంధించిన రెండు ప్రెస్టేజియస్ట్ ప్రాజెక్ట్స్ విడుదలైతే, తొలి రోజు కలెక్షన్స్ విషయంలో అభిమానుల మధ్య పోటీ కూడా నెలకొని ఉంటుంది. మూవీ లవర్స్ సైతం ఈ విషయంలో ఎంతో ఆసక్తిని కనపరచడం ఆనవాయితీ.

తెలుగు సినిమాకి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన బాహుబలి పార్ట్ 1 ,పార్ట్ 2 చిత్రాలు బాహుబలి ఎపిక్(Baahubali Epic)గా ఈ నెల 31 న వరల్డ్ వైడ్ గా విడుదల కానుంది. దీంతో అభిమానుల్లో, ప్రేక్షకుల్లో ఎపిక్ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. రాజమౌళి(Ss Rajamoul),ప్రభాస్(Prabhas),రానా(Rana)లు ప్రమోషన్స్ లో ఎపిక్ గురించి పలు ఆసక్తి కర విషయాలని చెప్తున్నారు. దీంతో ఎపిక్ ఎప్పుడెప్పుడు థియేటర్స్ లోకి వస్తుందా అనే ఉత్సాహం అందరిలో ఉంది. ఇక నవంబర్ 1 న విడుదల అవుతున్న మాస్ మహారాజా రవితేజ(Raviteja)వన్ మాన్ షో మాస్ జాతర(Mass Jathara)కోసం కూడా అభిమానులు, ప్రేక్షకులు ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. పక్కా మాస్ అంశాలతో మాస్ జాతర ముస్తాబవడం, భీమ్స్ అందించిన సాంగ్స్ ప్రేక్షకుల్లోకి వెళ్లడం, థమాకా తో మెప్పించిన రవితేజ శ్రీలీల కాంబో మరోసారి సిల్వర్ స్క్రీన్ పై మ్యాజిక్ చెయ్యబోతుందని ట్రైలర్ తో అర్ధం కావడంతో మాస్ జాతర కోసం కూడా అందరు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.

Also Read: చిరంజీవి పై మాళవిక మోహనన్ కీలక వ్యాఖ్యలు.. రూమర్స్ కి చెక్


దీంతో ఈ రెండు చిత్రాలు ఒక రోజు తేడాతోనే వస్తున్నా, తొలి రోజు హయ్యస్ట్ కలెక్షన్స్ లో ఎవరు గెలుస్తారనే చర్చ సోషల్ మీడియా వేదికగా అభిమానుల్లో జరుగుతుంది. ప్రస్తుతం రెండు చిత్రాలకి బుక్ మై షో లాంటి యాప్స్ లో బుకింగ్స్ ఫాస్ట్ గానే ఉన్నాయి. రెండు చిత్రాలు ఒక రోజు ముందుగానే ప్రీమియర్స్ తో ప్రేక్షకుల ముందుకు రానుండగా, ఓవర్ సీస్ లో కూడా రెండు చిత్రాలు ప్రీమియర్స్ దగ్గర నుంచే సందడి చేయనున్నాయి.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.