English | Telugu

లిప్పులాక్కుల్లో రెచ్చిపోయిన అనుష్క‌

వ‌రుస‌గా క‌త్తి ఫైట్లు, యుద్దాలు చేసి విసుగొచ్చిందేమో, డీ గ్లామ‌ర్ పాత్ర‌ల‌పై మోజు త‌గ్గిందేమో.. ఇప్పుడు గ్లామ‌ర్ క్వీన్‌గా అవ‌తారం ఎత్త‌డానికి తాప‌త్ర‌య‌ప‌డుతోంది అనుష్క‌. రుద్ర‌మ‌దేవి, బాహుబ‌లిలో పెద్ద‌గా త‌న గ్లామ‌ర్‌నిచూపించే స్కోప్ అనుష్క‌కు రాలేదు. బాహుబ‌లిలో అయితే `అమ్మమ్మ‌`గా క‌నిపిస్తోంది. రుద్ర‌మ‌దేవిలో క‌త్తి యుద్దాల‌కు త‌ప్ప‌, మ‌రో అంశానికి ప్రాధాన్యం లేకుండాపోయింది. అందుకే త‌దుప‌రి చిత్రం `సైజ్ జోరో`లో త‌న ముచ్చ‌ట్ల‌న్నీ తీర్చుకొంటోంది. ఈ సినిమాలో డీప్ లిప్ లాక్ స‌న్నివేశాలు రెండు మూడున్నాయ‌ట‌. వాటిలో అనుష్క చూపించిన స‌హ‌జ‌సిద్ద‌మైన న‌ట‌న ప్రేక్ష‌కుల్ని ముఖ్యంగా యువ‌త‌రాన్ని కిర్రెక్కిస్తుంద‌ని స‌మాచారం.

త‌మిళ న‌టుడు ఆర్య‌తో అనుష్క లిప్ లాక్ చేసిన స‌న్నివేశాల్ని ఇటీవ‌లే తెర‌కెక్కించారని, ఆ సీన్లో ఇద్ద‌రూ రెచ్చిపోయార‌న్న‌ది టాలీవుడ్ టాక్‌. ఇది వ‌ర‌కు అనుష్క‌, ఆర్య‌లు క‌లిసి వ‌ర్ణ చిత్రంలో న‌టించారు. ఆ స‌మ‌యంలో ఇద్ద‌రూ ప్రేమ‌లో ప‌డ్డార‌న్న వార్తలొచ్చాయి. ప్రేమ కాదు.. మేం జ‌స్ట్ ప్రెండ్స్ అని చెప్పుకొన్నార‌ప్పుడు. అయితే ఇప్పుడు మాత్రం నిజ‌మైన ప్రేమికుల్లా... ఒక‌రి పెదాల్ని ఇంంకొక‌రు పిండేసుకొన్నార్ట‌. మ‌రి ఆ సీన్లు ఎలా పండాయో తెలుసుకోవాలంటే.. ఈ సినిమా వ‌చ్చే వ‌ర‌కూ ఆగాలి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.