English | Telugu

నేను చనిపోయానని అనుకున్నారు..

అన్షు అంబానీ అంటే ఎవరికీ తెలీదు కానీ మన్మథుడు మూవీ హీరోయిన్‌ అంటే మాత్రం టక్కున గుర్తుపట్టేస్తారు. మన్మథుడులో సెకండ్ హీరోయిన్‌ రోల్ లో నటించిన ఈ బ్యూటీ అప్పట్లో కుర్రాళ్ల హృదయాలను దోచేసింది. మన్మధుడు మూవీలో మహేశ్వరి అనే అమాయకమైన అమ్మాయి పాత్రలో ఆకట్టుకుంది. ప్రభాస్‌ పక్కన  మెయిన్‌ హీరోయిన్‌గా  రాఘవేంద్ర మూవీలో కనిపించి  మెప్పించింది. అలాంటి అన్షు చివరిగా తమిళంలో ఇరవై ఏళ్ళ క్రితం జై అనే మూవీ చేసి ఇక ఆ తర్వాత తెర మీద కనిపించడం మానేసింది. అలాంటి అన్షు రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో ఎన్నో విషయాలను షేర్ చేసుకుంది.."ఐతే నేను మూవీస్ లో కనిపించడం మానేసాక చాలా మంది నేను కనిపించకుండా ఎక్కడికో వెళ్లిపోయానని, ఇంకొందరు నేను చనిపోయానని అనుకున్నారు.

ఈ కామెంట్స్ విన్నాక నాకు చాలా భయమేసింది. నాకు నేను ఆలోచించుకున్నా..అసలు నేను ఎందుకు ఈ ఫీల్డ్ నుంచి బయటకు వచ్చేసాను అని. ఐతే నేను ఇంగ్లాండ్ నుంచి ఇండియా వచ్చాక చాలా  మూవీ ఆఫర్స్ వచ్చాయి. నేను మన్మధుడు మూవీ చేసే టైంకి నాకు 16 ఏళ్ళు. ఇక తెర మీద కనిపించాలనే నా కోరిక నెరవేరింది దాంతో నేను ఇంగ్లాండ్ వెళ్ళిపోయి నా స్టడీస్ పూర్తి చేసాను. ఇప్పుడంటే పిఆర్ లు అలా ఉన్నారు యాక్టర్స్ కి కానీ అప్పట్లో అంటే నాతో మా నాన్న రావాల్సి వచ్చేది. నేను బ్రిటిష్ ఇండియన్..కానీ నేను ఇంగ్లాండ్ లో పుట్టాను..నా పూర్వీకులు భారతదేశానికి చెందిన వాళ్ళే. డిప్రెషన్, సోషల్ యాంగ్జైటీ ఇలాంటి వాటిని పోగొట్టడానికి థెరపిస్ట్ కోర్స్ చేశాను. నాకు ఇండస్ట్రీలో పెద్దగా ఫ్రెండ్స్ లేరు.. అప్పట్లో ఒక జాబ్ లా వచ్చి యాక్టింగ్ చేసి వెళ్లిపోయేదాన్ని. కానీ ప్రభాస్ మాత్రమే తెలుసు. నా కూతురు బాహుబలి చూసి చాలా హ్యాపీగా ఫీలవుతూ ఉంటుంది. శ్రీయ, ఆర్తి, భూమిక, త్రిష..వీళ్ళు తెలుసు కానీ పెద్దగా టచ్ లో లేను. రీసెంట్ గా గుంటూరు కారం చూసాను...భగవంత్ కేసరి మూవీస్ చూసాను. నాగార్జున గారితో పని చేయడం చాలా సంతోషంగా ఉండేది. అవకాశం వస్తే అందరితో నటించాలని ఉంది. నాగార్జున, అల్లు అర్జున్, ప్రభాస్, అల్లరి నరేష్, రామ్ చరణ్ తో అవకాశం వస్తే చేస్తాను.. రాజమౌళి గారంటే చాలా ఇష్టం" అని చెప్పింది అన్షు.